TS News: తెరాస ప్రభుత్వం రాకముందే ఎన్నో పరిశ్రమలొచ్చాయి: రఘునందన్‌
eenadu telugu news
Updated : 28/09/2021 14:48 IST

TS News: తెరాస ప్రభుత్వం రాకముందే ఎన్నో పరిశ్రమలొచ్చాయి: రఘునందన్‌

హైదరాబాద్‌: ఐటీ, పరిశ్రమల రంగంపై సోమవారం అసెంబ్లీలో జరిగిన మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన సమాధానంపై భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి సమాధానం తర్వాత తమ అభ్యంతరాలను తెలిపేందుకు స్పీకర్‌ నిరాకరించారని.. వెంటనే సభను వాయిదా వేశారని ఆయన ఆరోపించారు. భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘునందన్‌ మాట్లాడారు. రెండు రోజుల వర్షానికే అసెంబ్లీని మూడురోజులు వాయిదా వేయాల్సిన దుస్థితి ఏర్పడిందని రఘునందన్‌ ఆక్షేపించారు. తెరాస ప్రభుత్వం రాకముందే రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వచ్చాయని.. ఈ ఏడేళ్లలో వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు ఒక్కటీ రాష్ట్రానికి రాలేదన్నారు. కేసీఆర్‌ కుటుంబాన్ని విమర్శిస్తే రాష్ట్రాన్ని విమర్శించినట్లు కాదని చెప్పారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని