ఈ పెన్ను...భలే భలే! చదువుతుంది.. వినిపిస్తుంది
eenadu telugu news
Published : 29/09/2021 01:40 IST

ఈ పెన్ను...భలే భలే! చదువుతుంది.. వినిపిస్తుంది

డాల్ఫిన్‌ పెన్నుతో కథలను వింటున్న విద్యార్థులు

పెన్ను రాయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ పెన్నుకు అన్నీ ప్రత్యేకతలే.. డాల్ఫిన్‌ ఆకారంలో ఉన్న దీనిని అక్షరాలపై పెడితే సెన్సర్‌ల ద్వారా అక్షరాలను గ్రహించి శబ్దాన్ని బయటకు విడుదల చేస్తుంది. ఒత్తులు, దీర్ఘాలు, ఇబ్బందులు లేకుండా స్పష్టంగా వినపిస్తుంది. భాష నైపుణ్యం పదాల ఉచ్ఛారణ చక్కగా ఉంటుంది. దీంతో పిల్లలో పఠనాసక్తి పెరుగుతోంది. సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో 5, 6, 7, తరగతుల్లోని విద్యార్థులకు యునిసెఫ్‌ సహకారంతో ఈ పెన్నులను పంపిణీ చేశారు. కొన్ని పలకలేని పదాలను దీని ద్వారా విద్యార్థులు ఆసక్తిగా వింటున్నారు.

- ఈనాడు సంగారెడ్డి  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని