మాజీ మంత్రి ఇంటి కాపలాదారు అనుమానాస్పద మృతి
eenadu telugu news
Published : 29/09/2021 03:55 IST

మాజీ మంత్రి ఇంటి కాపలాదారు అనుమానాస్పద మృతి

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: జూబ్లీహిల్స్‌లో నివసించే ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి నివాసంలో పనిచేస్తున్న కాపలాదారు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాయత్రీహిల్స్‌లో శిల్పామోహన్‌రెడ్డి ఇల్లు ఉంది. ఇక్కడ అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన ఫకీరయ్య(60) పదిహేను సంవత్సరాలుగా భార్య ఈశ్వరమ్మతో కలిసి కాపలాదారుగా పనిచేస్తున్నాడు. ప్రతి రోజూ ప్రధాన ద్వారం వద్ద ఉన్న సెక్యూరిటీ పోస్టు వద్ద నిద్రిస్తుంటాడు. మంగళవారం తెల్లవారుజామున గన్‌మెన్‌ పాండురంగారెడ్డి అచేతనంగా పడి ఉన్న ఫకీరయ్యను గమనించి ఈశ్వరమ్మకు తెలియజేశాడు. వెంటనే 108 వాహనానికి సమాచారం ఇచ్చి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. భర్తకు అప్పులున్నాయని అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ఈశ్వరమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని