మూసీలో మరో గుర్తుతెలియని మృతదేహం
eenadu telugu news
Updated : 29/09/2021 05:35 IST

మూసీలో మరో గుర్తుతెలియని మృతదేహం

చైతన్యపురి, న్యూస్‌టుడే: మూసీలో మంగళవారం  మరో మృతదేహాం లభ్యమైన ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టరు రవికుమార్‌  వివరాల ప్రకారం.. సత్యానగర్‌కాలనీ సమీపంలోని మూసీలో సుమారు 30 ఏళ్ల వయస్సున్న గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి ఉస్మానియా మార్చురీకి తరలించారు.


నదిలో దూకిన వ్యక్తి.. కాపాడిన పోలీసులు

సైదాబాద్‌: పరవళ్లు తొక్కుతున్న మూసీలో ఓ వ్యక్తి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. నారాయణఖేడ్‌కు చెందిన కె.సంజీవరెడ్డి (42) అంబర్‌పేట దుర్గానగర్‌లో ఉంటున్నాడు. నెలనుంచి దంపతుల మధ్య గొడవ జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం భార్య ఠాణాలో ఫిర్యాదు చేసి పుట్టింటికి వెళ్లింది. మనస్తాపానికి గురైన సంజీవరెడ్డి మూసారాంబాగ్‌ డివిజన్‌ ధోబీఘాట్‌ కు వచ్చి నదిలోకి దూకాడు. మలక్‌పేట ఎస్సై బాల్‌రాజ్‌ గమనించి అప్రమత్తం చేయగా, కానిస్టేబుళ్లు మధు, కరుణాకర్‌ మూసీలో దూకి అతడిని కాపాడారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని