వైరస్‌ జన్యుక్రమాల ఆవిష్కరణలో దివ్యతేజ్‌
eenadu telugu news
Published : 29/09/2021 03:55 IST

వైరస్‌ జన్యుక్రమాల ఆవిష్కరణలో దివ్యతేజ్‌

ఈనాడు, హైదరాబాద్‌: సరైన సౌకర్యాలు.. అనువైన వాతావరణాన్ని కల్పిస్తే యువ పరిశోధకులు ఏదైనా సాధించగలరనేందుకు యువ శాస్త్రవేత్త దివ్యతేజ్‌ సౌపతి ఒక ఉదాహరణ. యువ పరిశోధకులకు, శాస్త్రవేత్తలకు తగిన మద్దతు ఇచ్చి ప్రోత్సహించేందుకు ఇది సరైన సమయం.

- డాక్టర్‌ వినయ్‌ కె నందికూరి, సీసీఎంబీ డైరెక్టర్‌

కరోనా మొదలైనప్పటి నుంచి దాదాపుగా ఏడాదిన్నర కాలంగా కొవిడ్‌ వైరస్‌పై సీసీఎంబీ పరిశోధనలు చేస్తోంది. వైరస్‌ వ్యాప్తిని తగ్గించే క్రమంలో ఏ వైరస్‌ రకం వ్యాప్తిలో ఉంది? ఏ మేరకు ప్రమాదకరం తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు నమూనాలు సేకరించి సీసీఎంబీలో వైరస్‌ జన్యుక్రమాన్ని కనుగొంటున్నారు. ఇప్పటివరకు 10 వేలపైనే వైరస్‌ జన్యుక్రమాలను ఇక్కడ ఆవిష్కరించగా ఇందులో కీలక పాత్ర పోషించారు యువ శాస్త్రవేత్త దివ్యతేజ్‌ సౌపతి. వీరి బృందం 60 వేలకంటే ఎక్కువ భారతీయ వైరస్‌ జన్యువులను విశ్లేషించింది. గ్లోబల్‌ డేటాతో పోల్చి చూసింది. దేశంలో మొదటగా కన్పించిన ఏ3ఐ రకాన్ని బయట పెట్టడంతోపాటు ఆధిపత్య వేరియంట్‌గా ఏ2ఏ విస్తరించిన తీరును వీరు విశ్లేషించారు. దివ్యతేజ్‌ సౌపతి చేసిన కృషికి రెండు రోజుల క్రితం దిల్లీలో కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) యువ శాస్త్రవేత్త అవార్డును అందుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని