Posani: పవన్‌ కల్యాణ్‌ అభిమానులు వేధిస్తున్నారు: పోసాని
eenadu telugu news
Updated : 29/09/2021 07:13 IST

Posani: పవన్‌ కల్యాణ్‌ అభిమానులు వేధిస్తున్నారు: పోసాని

హైదరాబాద్‌, పంజాగుట్ట - న్యూస్‌టుడే: పవన్‌కల్యాణ్‌ అతని అభిమానులతో తనను, తన కుటుంబ మహిళలను వేధిస్తున్నారని సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఆరోపించారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనసేన కార్యకర్తలు పోసానిపై దాడికి పాల్పడవచ్చనే సమాచారంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియా సమావేశం ముగిశాక పోసానిపై జనసేన తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌గౌడ్‌ నేతృత్వంలో పలువురు దాడికి యత్నించడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది.  

పోసానిని బహిష్కరించాలి..  పోసాని కృష్ణ మురళిని తెలంగాణ ప్రభుత్వం బహిష్కరించాలని జనసేన రాష్ట్ర ఇన్‌ఛార్జి శంకర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. పంజా పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. ప్రెస్‌క్లబ్‌లో పోసాని చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయన్నారు. అనంతరం పోసానిపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీ నిర్మాత బండ్ల గణేష్‌ ఠాణాకు వచ్చి పవన్‌ అభిమానులను పరామర్శించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని