Crime news: కాపలాదారే కాజేశాడు.. చింతల్‌బస్తీలో భారీ చోరీ
eenadu telugu news
Published : 17/10/2021 02:02 IST

Crime news: కాపలాదారే కాజేశాడు.. చింతల్‌బస్తీలో భారీ చోరీ

హైదరాబాద్‌: సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న చింతలబస్తీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంటికి కాపలాగా ఉన్న వాచ్‌మెన్‌ దంపతులే ఈ దోపిడీకి పాల్పడ్డారు. యజమాని ఇంట్లో లేని సమయంలో రూ.30 లక్షల విలువైన బంగారం కాజేశారు. వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న నేపాల్‌ దంపతులు.. వయసులో పెద్దవాళ్లైన ఇంటి యజమాని తల్లిదండ్రులను తాళ్లతో కట్టేసి ఇంట్లోని బంగారం ఎత్తుకెళ్లారు. యజ్ఞ అగర్వాల్‌ టెక్స్‌టైల్స్‌ యజమాని అగర్వాల్‌ ఇంట్లో ఈ దొంగతనం జరిగినట్లుగా పోలీసులు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని