రాజ్యాధికార సాధనకు కురుమలు ఉద్యమించాలి
eenadu telugu news
Published : 18/10/2021 03:58 IST

రాజ్యాధికార సాధనకు కురుమలు ఉద్యమించాలి


మాట్లాడుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్‌

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్యను స్ఫూర్తిగా తీసుకుని కురుమలు రాజ్యాధికారం సాధన కోసం ఉద్యమించాలని ఏపీలోని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండలంలోని కళ్లేం జరగారెడ్డి గార్డెన్‌లో.. నియోజకవర్గ కురుమల దసరా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కురుమ సంఘం నాయకులు మంగ వెంకటేశ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి.. ముఖ్య అతిథులుగా ఎంపీ గోరంట్ల మాదవ్‌, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేష్‌, గద్వాల్‌ జిల్లా ఛైర్‌పర్సన్‌ సరిత తిరుపతయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య, ప్రముఖ గాయకురాలు విమలక్క తదితరులు హాజరై మాట్లాడారు. కురుమలు నేటికీ రాజకీయంగా, ఆర్థికంగా వెనకబడ్డారని వారంతా చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు తగిన సంఖ్యలో కేటాయించి చట్టసభలో సరైన ప్రాతినిధ్యం దక్కేలా రాజకీయ పార్టీలు చొరవచూపాలని కోరారు. కార్యక్రమంలో కురమ సంఘం రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్‌, జిల్లా సహకార సంఘ వైస్‌ ఛైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్‌, కాలే రమేష్‌, కాలే గణేష్‌, నెర్రే మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని