తీవ్రవాదులను అణచివేయడంలో ఎన్‌ఎస్‌జీ కీలకం
eenadu telugu news
Published : 18/10/2021 04:04 IST

తీవ్రవాదులను అణచివేయడంలో ఎన్‌ఎస్‌జీ కీలకం


కార్ల ర్యాలీని ప్రారంభిస్తున్న గవర్నర్‌ తమిళిసై చిత్రంలో సీపీ అంజనీకుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాన్ని పురస్కరించుకుని పీపుల్స్‌ ప్లాజాలో బ్లాక్‌ క్యాట్‌ కార్ల ర్యాలీని ఆదివారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రారంభించారు. గవర్నర్‌ మాట్లాడుతూ.. తీవ్రవాద దాడులను అడ్డుకోవడం, అణిచివేయడంలో ఎన్‌ఎస్‌జీది కీలక పాత్ర అన్నారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం పోరాడుతూ తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులందరికీ ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. కార్ల ర్యాలీ.. ఐక్యత, దేశభక్తి స్ఫూర్తిని చాటుతుందన్నారు. ఎన్‌ఎస్‌జీ కమాండోలు నడిపే 15 ఎస్‌యూవీల బ్లాక్‌ క్యాట్‌ కార్ల ర్యాలీ 7500 కి.మీ. దూరం సాగనుంది.

* ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాన్ని పురస్కరించుకుని బేగంపేటలోని భారత వాతావరణ కేంద్రంలో ఈనెల 18 నుంచి 24వ తేదీ వరకు ఓపెన్‌డేతో పాటు, వెబినార్లు, క్విజ్‌ పోటీలను నిర్వహిస్తున్నారు. ఉదయం 10 నుంచి నిర్వహించే ఓపెన్‌డేలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొనవచ్ఛు వివరాలకు 040-27908506/6172 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్ఛు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని