Ts News: గురుకులాల ప్రారంభంపై స్టే ఎత్తేయాలి.. హైకోర్టును కోరిన ప్రభుత్వం
eenadu telugu news
Published : 18/10/2021 15:04 IST

Ts News: గురుకులాల ప్రారంభంపై స్టే ఎత్తేయాలి.. హైకోర్టును కోరిన ప్రభుత్వం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని గురుకులాల ప్రారంభంపై స్టే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. గురుకులాలు తెరవొద్దని గతంలో ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ మిగతా పాఠశాలలు నడుస్తున్నాయని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పరిస్థితుల దృష్ట్యా పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. ఎల్లుండి పిల్‌ విచారణను పరిశీలిస్తామని సీజే ధర్మాసనం వెల్లడించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని