జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కమిషనర్‌గా సుదర్శన్‌రెడ్డి!
eenadu telugu news
Published : 20/10/2021 02:00 IST

జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కమిషనర్‌గా సుదర్శన్‌రెడ్డి!

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో చెరువుల సంరక్షణ సమగ్రాభివృద్ధికి పురపాలకశాఖ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డిని జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కమిషనర్‌గా నియమించేందుకు రంగం సిద్ధమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆయన పేరు ముఖ్యమంత్రి కార్యాలయం పరిశీలనలో ఉంది. గతంలో జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌గా పనిచేసిన ఐఏఎస్‌ అధికారిణితో పాటు పలువురి అధికారుల పేర్లు సైతం పరిశీలనలో ఉన్నాయి. నగరంలో మూడేళ్లుగా వానాకాలంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో చాలా ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ప్రతి చెరువుకు బృహత్‌ ప్రణాళిక రూపొందించి, పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ప్రత్యేక విభాగం అవసరమని భావించారు. ఈ మేరకు పురపాలకశాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ జీహెచ్‌ఎంసీ చట్టం మేరకు ప్రత్యేక కమిషనర్‌ను నియమించనున్నట్లు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వేర్వేరుగా పనిచేస్తున్న అన్ని విభాగాలు ప్రత్యేక కమిషనర్‌ కింద పనిచేయనున్నాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని