ఉత్తరాఖండ్‌లో మిత్ర బృందానికి చేయూత
eenadu telugu news
Published : 20/10/2021 02:00 IST

ఉత్తరాఖండ్‌లో మిత్ర బృందానికి చేయూత

అక్కడి పరిస్థితిని వివరిస్తున్న సుష్మ

మల్కాజిగిరి, న్యూస్‌టుడే: దసరా సెలవులను సరదాగా గడుపుదామని స్నేహితులతో కలిసి ఉత్తరాఖండ్‌కు వెళ్లిన మల్కాజిగిరి యువతి అక్కడ ఆకస్మిక వరదలో చిక్కుకొంది. ఆ విషయాన్ని ఆమె ఇక్కడ కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. ఉత్తరాఖండ్‌లో తమ కుమార్తె, ఆమె స్నేహితులకు ఎదురైన ఇబ్బందిని ఇక్కడి స్థానిక తెరాస నేత మాజీ కార్పొరేటర్‌ జగదీశ్‌గౌడ్‌, భాజపా సీనియర్‌ నాయకుడు ఆర్కే శ్రీనివాస్‌ దృష్టికి మంగళవారం తల్లిదండ్రులు తీసుకువెళ్లారు. వారు వెంటనే స్పందించి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్రమంత్రి కేటీఆర్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. వారు అక్కడి ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని సుష్మ, ఆమె స్నేహితులను స్వస్థలాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. మల్కాజిగిరి డివిజన్‌ ఆర్కేనగర్‌లో నివసించే ప్రసాద్‌, ఉషారాణి దంపతుల రెండో కుమార్తె సుష్మ ఐజీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. దసరా సెలవుల సందర్భంగా ఆమె తనతో పనిచేస్తున్న ఉత్తరభారతానికి చెందిన స్నేహితులు హోలీ, కృతి, శ్రుతి, శుశిలతో కలిసి ఈ నెల 14న ఉత్తరాఖండ్‌ టూర్‌కు బయలుదేరారు. మంగళవారం తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నెల 17, ఆదివారం నుంచి అక్కడ భారీ వర్షాలు కురుస్తూ సోమవారం మరింత ఉద్ధృతం కావటంతో వీరు విశ్రాంతి తీసుకుంటున్న హోటల్‌లోకి నీరు చేరటంతో ఆందోళనకు గురైన సుష్మ అక్కడి పరిస్థితిని సోమవారం రాత్రి కుటుంబ సభ్యులకు వివరించారు. ఇక్కడ వారు నేతల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని