సత్తాచాటిన అథ్లెట్లు
eenadu telugu news
Published : 20/10/2021 02:00 IST

సత్తాచాటిన అథ్లెట్లు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: అఖిల భారత క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో గోవాలో జరిగిన జాతీయ క్రీడా ఛాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి అథ్లెట్లు సత్తాచాటారు. వివిధ విభాగాల్లో పసిడి పంట పండించారు. 23 స్వర్ణాలు, 4 రజతాలు, 4 కాంస్యాలు సొంతం చేసుకున్నారు. అండర్‌-14 బాలుర విభాగం 100మీ.పరుగులో అభినవ్‌ స్వర్ణం, 200మీ.పరుగులో గౌతమ్‌ రజతం, 400మీ.పరుగులో రోషన్‌ వెండి పతకం గెలిచారు. అండర్‌-19 అబ్బాయిల 200మీ, 400మీ.పరుగులో వరుసగా రవి కుమార్‌, అనుదీప్‌ రెడ్డి పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. సీనియర్‌ పురుషుల 3000మీ. పరుగులో ప్రశాంత్‌ ఛాంపియన్‌గా నిలిచాడు. అండర్‌-17 బాలికల 100మీ. పరుగులో అక్షిత బంగారు పతకం కైవసం చేసుకుంది. అండర్‌-19 అమ్మాయిల 400మీ. పరుగులో హైందవి అగ్రస్థానంలో నిలిచింది. బాలురు.. అండర్‌-12 100మీ.పరుగు: వినీల్‌, 200మీ.పరుగు: హృషికేశ్‌, 400మీ.పరుగు: రేయాన్ష్‌ (స్వర్ణం); అండర్‌-14 100మీ.పరుగు: అభినవ్‌ (స్వర్ణం), 200మీ.పరుగు: గౌతమ్‌ (రజతం); 400మీ: రోషన్‌ (రజతం); అండర్‌-17 100మీ: హర్షవర్ధన్‌ (స్వర్ణం), విలోహిత్‌ (కాంస్యం), 200మీ: రాహుల్‌ (స్వర్ణం), అర్జున్‌ (రజతం), మహి (కాంస్యం), 400మీ: శ్రీవర్ధన్‌ (స్వర్ణం); అండర్‌-19 200మీ: రవికుమార్‌, 400మీ: అనుదీప్‌ (స్వర్ణం); అండర్‌-21 షాట్‌పుట్‌: సాయిదీప్‌, 200మీ: అభినవ్‌, 3000మీ: కిరణ్‌ (స్వర్ణం); అండర్‌-23 లాంగ్‌జంప్‌: పృథ్వీధర్‌, 400మీ: రాకేశ్‌ (స్వర్ణం); సీనియర్‌ పురుషుల 3000మీ: ప్రశాంత్‌ (స్వర్ణం); బాలికలు.. అండర్‌-17 100మీ: అక్షిత, 400మీ: పుష్పజ, షాట్‌పుట్‌: సిరి (స్వర్ణం); అండర్‌-19 400మీ: హైందవి (రజతం)


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని