విజయగర్జనకు 16 వేల బస్సులు
eenadu telugu news
Updated : 20/10/2021 03:44 IST

విజయగర్జనకు 16 వేల బస్సులు

● నియోజకవర్గాల సమీక్షలో కేటీఆర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్‌ చిత్రంలో బాజిరెడ్డి గోవర్ధన్‌, పువ్వాడ అజయ్‌,
వేముల ప్రశాంత్‌రెడ్డి, కేకే, సంతోష్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, కవిత

ఈనాడు, హైదరాబాద్‌: ‘తెరాస ద్విదశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని వచ్చే నెల 15న వరంగల్‌లో జరిగే తెలంగాణ విజయగర్జన సభకు 16 వేల బస్సులు నడుపుతామని, అందులో ఆరువేలు ఆర్టీసీ’వని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు తెలిపారు. ఈ నెల 25న హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో జరిగే తెరాస ప్లీనరీకి వచ్చే ప్రతినిధులు గులాబీ చొక్కా, చీరలు ధరించి రావాలని సూచించారు. విజయగర్జన, ప్లీనరీ సన్నాహాల్లో భాగంగా మంగళవారం రెండోరోజు నగరంలోని పలు నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, మహమూద్‌అలీ, పార్టీ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి బండిరమేశ్‌, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. తెరాస అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్‌ పేరును ప్రతిపాదిస్తూ మంగళవారం ప్రగతిభవన్‌లో మైనారిటీ విభాగం నేతలు నామినేషన్లు వేశారు. ఈ నెల 25న పార్టీ అధినేత ఎన్నిక కోసం నిర్వహించే ప్లీనరీ నిర్వహణపై మంత్రి సబితారెడ్డి మంగళవారం హైటెక్స్‌లో సమీక్ష నిర్వహించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని