HYD: చందానగర్‌లో విషాదం.. డ్రైనేజీ సంపులో పడి బాలుడి మృతి
eenadu telugu news
Published : 20/10/2021 13:37 IST

HYD: చందానగర్‌లో విషాదం.. డ్రైనేజీ సంపులో పడి బాలుడి మృతి

శేరిలింగంపల్లి: హైదరాబాద్‌లోని చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి పాపిరెడ్డి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. తోటిపిల్లలతో ఆడుకుంటూ ఏడేళ్ల బాలుడు డ్రైనేజీ సంపులో పడి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పాపిరెడ్డి కాలనీ రాజీవ్‌ గృహకల్ప ప్రాంతానికి చెందిన రాజు, అనుబాయి దంపతుల కుమారుడు అరవింద్‌(7). మంగళవారం సాయంత్రం ఆడుకుంటూ ఆదృశ్యమయ్యాడు.

బాలుడి కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో రాత్రి చందానగర్‌ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ రోజు ఉదయం ఇంటికి సమీపంలో ఉన్న డ్రైనేజీ సంపులో బాలుడి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని