హత్య చేసింది మేజర్లే
eenadu telugu news
Published : 21/10/2021 06:47 IST

హత్య చేసింది మేజర్లే

తల్లిని హతమార్చిన కేసులో కుమార్తె, ఆమె ప్రియుడికి రిమాండ్‌

యాదమ్మ

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: ప్రేమకు అడ్డు వస్తుందనే కారణంతో ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కుమార్తె, ఆమెకు సహకరించిన ప్రియుడిని రాజేంద్రనగర్‌ పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలించారు. హత్య జరిగిన రోజు మైనర్లుగా భావించిచా, తరువాత ఇద్దరూ మేజర్లేనని నిర్ధారించారు. చింతల్‌మెట్లో నివసించే యాదమ్మ(40), యాదయ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు పెళ్లవగా, చిన్న కుమార్తె నందిని(19) ఇంటి వద్దే ఉంటోంది. స్థానికుడైన రాంకుమార్‌(19)తో నందినికి రెండేళ్లుగా ఉన్న పరిచయం ప్రేమగా మారింది. ఎవరూ లేనప్పుడు తరచూ నందిని ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. యాదమ్మకు తెలిసి కుమార్తెను మందలించింది. సోమవారం యాదమ్మ బయటకువెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉన్న అతను బయటకు వెళ్లిపోయాడు. కుమార్తెను తల్లి తీవ్రంగా మందలించింది. ఆగ్రహించిన నందిని ఫోన్‌చేసి రామ్‌కుమార్‌ను ఇంటికి పిలిచి, తల్లిని గొంతు నులిమి చున్నీ చుట్టి హత్య చేసింది. రామ్‌కుమార్‌ వెళ్లిపోగా, నందిని ఏమీ తెలియనట్టు బయట కూర్చొంది. సాయంత్రం ఇంటికి వచ్చిన యాదయ్య విషయం గమనించి యాదమ్మ చనిపోయినట్లు నిర్ధారించుకున్నారు. అప్పటికే అనుమానించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. బుధవారం ఇద్దరినీ అరెస్టు చేసినట్లు రాజేంద్రనగర్‌ సీఐ కనకయ్య తెలిపారు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని