TS News: హుజూరాబాద్‌లో దళితబంధు నిలిపివేతపై హైకోర్టులో పిల్‌
eenadu telugu news
Published : 21/10/2021 17:29 IST

TS News: హుజూరాబాద్‌లో దళితబంధు నిలిపివేతపై హైకోర్టులో పిల్‌

హైదరాబాద్‌: హుజూరాబాద్‌లో దళితబంధు నిలిపివేతపై  హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ సామాజిక వేత్త మల్లేపల్లి లక్ష్మయ్య ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈసీ, సీఈవో, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా పేర్కొన్నారు. 

హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక దృష్ట్యా దళితబంధు నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. ఎన్నికల కమిషన్‌ నిర్ణయం సహేతుకంగా లేదు, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే కొనసాగుతున్న ప్రభుత్వ పథకాలను నిలిపివేయాల్సిన అవసరం లేదన్న విషయాన్ని ఎన్నికల కమిషన్‌ పరిగణనలోకి తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించారు. ఇప్పటికే కొనసాగుతున్న మిగతా పథకాల జోలికి వెళ్లకుండా కేవలం దళితబంధు పథకాన్ని మాత్రమే ఆపాలని ఈసీ ఆదేశించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పిటిషన్‌ లో వివరించారు. ఎన్నికల కమిషన్‌ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు ఎస్సీ, ఎస్టీ చట్టానికి విరుద్ధంగా ఉన్నందున వెంటనే  రద్దు చేయాలని కోరారు. వెంటనే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు అమలు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని