సాంకేతిక పరిజ్ఞానంతో నేరపరిశోధన: ఎస్పీ
eenadu telugu news
Published : 22/10/2021 00:47 IST

సాంకేతిక పరిజ్ఞానంతో నేరపరిశోధన: ఎస్పీ

అమరవీరుల స్థూపం వద్ద మౌనం పాటిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే, అధికారులు

వికారాబాద్‌, న్యూస్‌టుడే: శాంతి భద్రతల పరిరక్షణతోనే సమాజం బాగుంటుందని.. విరామం లేకుండా విధుల్లో ఉండేది ఒక్క పోలీసుశాఖేనని.. ప్రజలు సహకరిస్తే మరిన్ని మెరుగైన సేవలు అందిస్తామని జిల్లా పోలీసు అధికారి నారాయణ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా పాలనాధికారిణి నిఖిల, వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌లతో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించాక, అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు, సమాజ రక్షకులైన పోలీసులకు వ్యత్యాసం లేదని పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రజల రక్షణే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహించారని, వారి కృషి ప్రశంసనీయమన్నారు. దేశవ్యాప్తంగా సెప్టెంబరు 2020 నుంచి ఆగస్టు 2021 వరకు రక్షణ విధులు నిర్వహిస్తూ 377 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని, వారిని స్మరించుకోవడం అందరి బాధ్యతని అన్నారు. పండుగ, సెలవు రోజుల్లో ప్రజలంతా కుటుంబ సభ్యులతో హాయిగా కాలం గడుపుతుంటే, పోలీసులు మాత్రం అన్నింటినీ వదిలిపెట్టి ఎలాంటి అలజడులు చెలరేగకుండా పహారా కాయాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని చురుగ్గా నేరపరిశోధన చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్పీ రషీద్‌, వికారాబాద్‌, తాండూరు, పరిగి డీఎస్పీలు సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్‌, ఏఆర్‌ డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని