సాంకేతిక విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేయూత
eenadu telugu news
Published : 22/10/2021 02:22 IST

సాంకేతిక విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేయూత


మాట్లాడుతున్న లింబాద్రి

బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: సాంకేతిక విద్య అభ్యసించేందుకు విద్యార్థినులు ఉత్సాహంగా ఉన్నారని, ఇటీవల వరుసగా పోటీ పరీక్షల్లో అధిక శాతం వారే ఉత్తీర్ణత సాధించడం ఇందుకు నిదర్శనమని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి పేర్కొన్నారు. ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రకటించిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ఇండియా ర్యాంకింగ్స్‌- 2021లో ర్యాంకులు పొందిన రాష్ట్ర ఉన్నత విద్యాసంస్థలకు సత్కార కార్యక్రమం గురువారం రాత్రి బంజారాహిల్స్‌లోని హోటల్‌ తాజ్‌కృష్ణలో నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అకడమిక్‌ ఎక్స్‌లెన్స్‌ (ఐఏఈ) సంస్థ డైరెక్టర్‌ కె. వెంకటేష్‌ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన పోటీ ఉన్నప్పుడే అభివృద్ధి బాగుంటుందన్నారు. ఐఐటీ హైదరాబాద్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ ఛైర్మన్‌ పద్మశ్రీ డా. బీవీఆర్‌ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. 60 శాతం ఉపాధి కల్పన చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సంస్థల వల్లే జరుగుతోందన్నారు. రాష్ట్ర సాంకేతిక విద్యా విభాగం కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ మాట్లాడుతూ.. పెద్దసంఖ్యలో ఉన్నత విద్యాసంస్థలు పొందడం ర్యాంకుల్లో చోటు దక్కించుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం హెచ్‌సీయూ, ఐఐటీ హైదరాబాద్‌, అనురాగ్‌ విశ్వవిద్యాలయం, లయోలా అకాడమీ, జేఎన్‌టీయూ, సీబీఐటీ తదితర 45 ఉన్నత విద్యాసంస్థల ప్రతినిధులకు జ్ఞాపికలను అందజేసి, శాలువాతో సత్కరించారు. హెచ్‌సీయూ వీసీ ఆచార్య బీజే రావు, జేఎన్‌టీయూ వీసీ ఆచార్య కట్టా నర్సింహరెడ్డి పలు విద్యా సంస్థలకు ప్రతినిధులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని