ఎస్పీడీసీఎల్‌కు ఆర్‌ఈసీ ప్రశంసలు
eenadu telugu news
Published : 22/10/2021 02:22 IST

ఎస్పీడీసీఎల్‌కు ఆర్‌ఈసీ ప్రశంసలు


ప్రశంసాపత్రంతో సీఎండీ రఘుమారెడ్డి, అధికారులు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: భారత ప్రభుత్వ గ్రామీణ విద్యుద్దీకరణ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ), దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌) పరిధిలోని సెంట్రల్‌ పవర్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ (సీపీటీఐ) విభాగాన్ని ప్రశంసించింది. దీనిపై సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి స్పందిస్తూ.. సంస్థలో పనిచేసే 2158 మంది క్షేత్రస్థాయి సిబ్బందికి వివిధ అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని ఆర్‌ఈసీ ప్రతిపాదించిందని, ఈ మేరకు నిర్దేశిత కాలపరిమితిలో శిక్షణను విజయవంతంగా పూర్తిచేసినందుకు ప్రశంసాపత్రంతోపాటు, రూ.1.02 కోట్ల ప్రోత్సాహకాన్ని అందజేసిందని వివరించారు. నిరంతర విద్యుత్‌ సరఫరా, సంస్థ కార్యకలాపాల్లో నూతన సాంకేతిక అమలు వంటి అంశాల్లోనూ జాతీయ స్థాయి అవార్డులు, ప్రశంసలు దక్కాయన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని