సరూర్‌నగర్‌ ఎస్సై సస్పెన్షన్‌
eenadu telugu news
Published : 22/10/2021 02:22 IST

సరూర్‌నగర్‌ ఎస్సై సస్పెన్షన్‌

సరూర్‌నగర్‌ క్రైం, న్యూస్‌టుడే: నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితులతో రాజీపడి సెటిల్మెంట్లు చేస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో సరూర్‌నగర్‌ ఠాణా ఎస్సై బి.సైదులుపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు గురువారం రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ ఉత్తర్వులు జారీచేశారు. నిందితులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయకుండా దుష్ప్రవర్తనతో బెదిరించడం, తప్పించేందుకు డబ్బు డిమాండ్‌ చేస్తూ అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. వ్యక్తిగత అవసరాలకు కూడా ఉపయోగించుకున్నారని వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని