Huzurabad by-poll: భాజపాపై ఎన్నికల సంఘానికి తెరాస ఫిర్యాదు
eenadu telugu news
Published : 22/10/2021 15:44 IST

Huzurabad by-poll: భాజపాపై ఎన్నికల సంఘానికి తెరాస ఫిర్యాదు

హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో భాజపాతో పాటు ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని తెరాస ఆరోపించింది. ఓటర్లకు డబ్బులు పంచేందుకు బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారంటూ ఆ పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. చాలా మంది పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచి గూగుల్‌ పే, ఫోన్‌పేల ద్వారా ఓటర్ల డబ్బు పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌  వచ్చాక కూడా భాజపా నేతలు కేంద్రమంత్రితో పక్క నియోజకవర్గంలో సమావేశం పెట్టారని గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం కేసీఆర్‌ సభ పెడతామంటే ఈసీ ఆంక్షలు పెడుతోందని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా ప్రభావితం చేస్తున్నట్టు కనిపిస్తోందని విమర్శించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని