సప్త వసంతాల షివంగి
eenadu telugu news
Published : 24/10/2021 02:01 IST

సప్త వసంతాల షివంగి

ఈనాడు, హైదరాబాద్‌ : మహిళలపై వేధింపుల నియంత్రణలో ప్రత్యేకత చాటుతున్న ‘షీ’ బృందాలు ఏడేళ్లు పూర్తి చేసుకున్నాయి. వీటిని 2014 అక్టోబరు 24న ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 331 ఉన్నాయి. షీ బృందాల గురించి 30,427 సదస్సుల ద్వారా 30,51,323 మందికి అవగాహన కల్పించినట్లు తెలంగాణ మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా శనివారం వెల్లడించారు. ఏడేళ్లలో 35,699 ఫిర్యాదులను పరిష్కరించారు.

క్యూఆర్‌ కోడ్‌, వాట్సప్‌ల ద్వారా ఫిర్యాదు

గత మార్చి 21న క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఫిర్యాదు చేసే విధానాన్ని ప్రారంభించారు. జనసమ్మర్ధ ప్రాంతాల్లో బార్‌ కోడ్‌లను అందుబాటులో ఉంచారు. ఫిర్యాదులకు వాట్సప్‌ నంబరు(9441669988)నూ అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా 2020లో 537, ఈ ఏడాది సెప్టెంబరు చివరి నాటికి 435 ఫిర్యాదులు వచ్చాయి.

గర్ల్‌ సేఫ్టీ క్లబ్‌లు.. సైబ్‌-హర్‌

కళాశాలల్లో వేధింపులను షీ బృందాల దృష్టికి తీసుకెళ్లేందుకు ‘గర్ల్‌ సేఫ్టీ క్లబ్‌’ల పేరిట 13 కళాశాలల్లో 325 మంది వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. ఆన్‌లైన్‌ వేధింపుల నియంత్రణకు ‘సైబ్‌-హర్‌’ను తెరపైకి తెచ్చారు. నెల రోజుల్లోనే 50 లక్షల మందికి అవగాహన కల్పించారు. ‘సైబర్‌ కాంగ్రెస్‌’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా 1,650 జిల్లాపరిషత్‌ పాఠశాలల్లోని 3,300 మంది ఔత్సాహిక విద్యార్థుల్ని సైబర్‌ అంబాసిడర్లుగా తీర్చిదిద్దారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని