అవార్డుతో పెరిగిన బాధ్యత: ఎమ్మెల్సీ వాణీదేవి
eenadu telugu news
Published : 24/10/2021 02:01 IST

అవార్డుతో పెరిగిన బాధ్యత: ఎమ్మెల్సీ వాణీదేవి

సురభివాణీదేవికి అవార్డు అందజేస్తున్న అంపశయ్య నవీన్‌, నాగేశ్వర్‌రావు తదితరులు

విద్యానగర్‌, న్యూస్‌టుడే: అవార్డు మరింత బాధ్యతను పెంచిందని శాసన మండలి సభ్యురాలు సురభి వాణీదేవి అన్నారు. నల్లకుంట డివిజన్‌ హిందీ విద్యాలయంలో వరల్డ్‌ పీస్‌ ఫెస్టివల్‌ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం శాంతిదూత అవార్డును ఆమె అందుకున్నారు. సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వర్‌రావు, సొసైటీ గౌరవ అధ్యక్షుడు అంపశయ్య నవీన్‌ ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాన్న పీవీ నర్సింహారావు జీవితం ఆదర్శమన్నారు. సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ సమాజ సేవకు ముందుకు రావాలని యువతకు సూచించారు. మాజీ మంత్రి పురుషోత్తమరావు, బ్రిగేడియర్‌ గణేశం, హిందీ విద్యాలయ ప్రతినిధులు సురేంద్ర లూనియా, దీపక్‌ భట్టాచార్యలకు భారత శాంతిదూత అవార్డులను ప్రదానం చేశారు. సొసైటీ అధ్యక్షుడు మహ్మద్‌ సిరాజుద్దీన్‌, ప్రొఫెసర్లు సురేశ్‌లాల్‌, నర్సింహామూర్తి, ప్రముఖులు శ్రీపాద సుధాకర్‌రావు, భూపతిరాజ్‌, శనిగరపు రాజమోహన్‌, నిమ్మల శ్రీనివాస్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని