చదువుకు వచ్ఛి. జైలుకు వెళ్లి.. స్వదేశానికి చేరి!
eenadu telugu news
Published : 24/10/2021 02:21 IST

చదువుకు వచ్ఛి. జైలుకు వెళ్లి.. స్వదేశానికి చేరి!

ఎంజోకు ఫ్రాన్సిస్‌

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: చదువుకోవడానికి వచ్చిన నైజీరియన్‌ మాదకద్రవ్యాల కేసులో అరెస్టయ్యాడు. రెండున్నరేళ్ల జైలు జీవితం గడిపాడు. ఇటీవల విడుదలైన అతని పాస్‌పోర్టు, వీసా గడువు ముగిసింది. దీంతో అతడిని స్వదేశం పంపడానికి పోలీసులు మూడు నెలలు కష్టించాల్సి వచ్చింది. బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శివచంద్ర తెలిపిన వివరాల ప్రకారం నైజీరియాకు చెందిన ఎంజోకు ఫ్రాన్సిస్‌ అలియాస్‌ మార్టియన్స్‌ డాన్‌లో అనోల్డ్‌ కొన్నేళ్ల క్రితం నగరానికి స్టూడెంట్‌ వీసా మీద వచ్చాడు. చదువుకుంటూనే మాదకద్రవ్యాలను విక్రయిస్తూ 2019లో పోలీసులకు చిక్కాడు. అప్పటికే నాలుగైదు కేసుల్లో నిందితుడిగా ఉండటంతో పీడీ చట్టం నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. రెండున్నర సంవత్సరాలు జైలు జీవితం గడిపి మూడు నెలల క్రితం విడుదలయ్యాడు. స్వదేశానికి తిరిగి వెళ్తానని పోలీసులకు చెప్పడంతో పాస్‌పోర్టు, వీసా పరిశీలించారు. గడువు ముగియడంతో విదేశీ వ్యవహారాల శాఖతోపాటు హైదరాబాద్‌లోని ఫారెన్‌ ఎక్స్ఛేంజీ కార్యాలయాల్లో నిందితుడి వివరాలు సమర్పించారు. పోలీసులు అందజేసిన ఆధారాలను పరిశీలించిన విదేశీ వ్యవహారాల శాఖ ఎంజోకు ఫ్రాన్సిస్‌ స్వదేశానికి వెళ్లేందుకు అనుమతించింది. బంజారాహిల్స్‌ ఎస్సై అజయ్‌కుమార్‌, సిబ్బంది అతడిని ముంబయి తీసుకువెళ్లి శుక్రవారం నైజీరియా వెళ్లే విమానం ఎక్కించి తిరిగొచ్చారు. అక్కడికి చేరుకున్న విషయాన్ని ధ్రువీకరించుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని