Huzurabad by election: ఆ విషయంలో కేసీఆర్‌, కేటీఆర్, హరీశ్‌రావులు అంతే: రేవంత్‌ 
eenadu telugu news
Updated : 24/10/2021 19:36 IST

Huzurabad by election: ఆ విషయంలో కేసీఆర్‌, కేటీఆర్, హరీశ్‌రావులు అంతే: రేవంత్‌ 

కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను స్థానికేతరుడు అనడంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు తమ నియోజకవర్గాలకు అనామకులే అని విమర్శించారు. బల్మూరి వెంకట్‌ స్థానికేతరుడు అని కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో పోలీసులను నిజాయతీగా విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. తెరాస, భాజపా హుజూరాబాద్‌ను వ్యసనాలకు అడ్డాగా మార్చాయని రేవంత్‌ ఆరోపించారు. భయపెట్టి ఓట్లు పొందేందుకు హరీశ్‌రావు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

‘‘పంపకాల్లో తేడాతోనే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక జరుగుతోంది. దళిత బంధు, పేదల ఇళ్ల కోసం ఈటల రాజీనామా చేయలేదు. అభ్యర్థులు లోకల్‌, నాన్‌లోకల్‌ అంటున్నారు. సిరిసిల్ల, గజ్వేల్‌, సిద్దిపేటలో పోటీ చేసిన వారు స్థానికులా?సిద్దిపేటలో దళితబంధు ఇప్పించరా?దుబ్బాక, హుజూరాబాద్‌, సాగర్‌లో హామీలేమయ్యాయి. రాష్ట్ర పోలీస్‌ విభాగం విడిపోయింది.

డీజీపీ ఫోన్‌ కూడా ట్యాప్‌ అవుతోంది. నర్సింగరావు డీజీపీపై.. వేణుగోపాలరావు మాపై నిఘా పెట్టారు. ప్రవీణ్‌కుమార్‌ వేరే పార్టీలో చేరొచ్చు. ప్రవీణ్‌కుమార్‌ సామాజికవర్గ అధికారులను వేధిస్తున్నారు. తెలంగాణ కోసం కేసీఆర్‌ కుటుంబంలో ఆత్మత్యాగాలెవరు చేశారు. త్వరలో తెరాసలో ముసలం ఖాయం’’ అని రేవంత్‌ అన్నారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని