కందికి భౌగోళిక గుర్తింపు లభిస్తే ప్రయోజనం
eenadu telugu news
Published : 28/10/2021 00:37 IST

కందికి భౌగోళిక గుర్తింపు లభిస్తే ప్రయోజనం

మాట్లాడుతున్న డాక్టర్‌ సుధాకర్‌, అవగాహన సదస్సుకు హాజరైన రైతులు

తాండూరు, న్యూస్‌టుడే: తాండూరు నియోజకవర్గంలో సాగవుతున్న కందికి భౌగోళిక గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సుధాకర్‌ అన్నారు. కంది పంట సాగు పద్ధతిపై తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో బుధవారం జిల్లాలోని రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భౌగోళిక గుర్తింపు లభిస్తే పంటను సాగు చేసే రైతులకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. కంది సాగుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గుర్తింపునకు అవసరమైన ప్రక్రియ ఉన్నత స్థాయిలో శరవేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న కందికి చీడపీడలను  నిర్మూలిస్తే దిగుబడులు సాధించ వచ్చన్నారు. తాండూరు ఏరువాక కేంద్రం సమన్వయకర్త డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ అక్టోబరు నుంచి పంట కోత కోసుకునే వరకు పాటించాల్సిన పద్ధతులను వివరించారు. శాస్త్రవేత్త డాక్టర్‌ రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ  పంట వైరస్‌ బారిన పడకుండా రైతులు క్రమం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్‌ సుజాత, డాక్టర్‌ సందీప్‌, మాణిక్య మిన్ని, కోరమాండల్‌ ఎరువుల ఉత్పత్తి కంపెనీ సహాయ వైస్‌ ప్రెసిడెంట్‌ భాస్కర్‌రెడ్డి, ప్రతినిధులు వెంకటేశ్వర్లు, సుధాకర్‌రెడ్డి, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని