ప్రజలకు బ్యాంకులను చేరువ చేసేందుకే రుణ విస్తరణ
eenadu telugu news
Published : 28/10/2021 00:56 IST

ప్రజలకు బ్యాంకులను చేరువ చేసేందుకే రుణ విస్తరణ

జ్యోతి వెలిగిస్తున్న జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, పక్కనే సీజీఎం అమిత్‌ జింగ్రాన్‌

రెజిమెంటల్‌బజార్‌: ప్రజల వద్దకే వెళ్లి రుణాలు అందించడం ద్వారా బ్యాంకులు మరింత దగ్గరవుతాయని జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఎస్‌బీఐ తెలంగాణ సీజీఎం అమిత్‌ జింగ్రాన్‌ అన్నారు. ఆజాదీకా అమృతోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వివిధ బ్యాంకులు బుధవారం హరిహరకళాభవన్‌లో రుణమేళా నిర్వహించాయి. ముఖ్య అతిథిలు వెంకటేశ్వర్లు, అమిత్‌ జింగ్రాన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 నుంచి వివిధ బ్యాంకులతో మేళాలు నిర్వహించి, అక్కడికక్కడే రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి మేళా రెండురోజుల పాటు జరుగుతుందని, మొదటిరోజు సుమారు రూ.237 కోట్ల రుణాలు అందించారని వివరించారు. లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ రవిశంకర్‌ ఠాగూర్‌, వివిధ బ్యాంకుల డీజీఎంలు వీఎంఎన్‌ఎస్‌ సాయిబాబా, అమిత్‌ శ్రీవాస్తవ్‌, కౌత్సా మజుందార్‌, ప్రసాద్‌రెడ్డి, సత్యనారాయణ పాణిగ్రాహి, మోహన్‌దాస్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని