‘ఉస్మానియా’ నూతన భవనాన్ని త్వరగా నిర్మించాలి
eenadu telugu news
Published : 28/10/2021 00:56 IST

‘ఉస్మానియా’ నూతన భవనాన్ని త్వరగా నిర్మించాలి

మాట్లాడుతున్న టీజూడా ప్రతినిధులు

సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం త్వరగా చేపట్టాలని తెలంగాణ జూనియర్‌ వైద్యుల సంఘం (టీజూడా) కోరింది. బుధవారం కోఠి ఉస్మానియా వైద్య కళాశాల ఆవరణలోని జూడా కార్యాలయంలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డా.సాగర్‌, డా.కార్తీక్‌ సలహాదారులు డా.రాజీవ్‌, డా.విజయ్‌ మాట్లాడారు. ఆసుపత్రి శిథిలావస్థకు చేరి రోగులు, వైద్యులు, సిబ్బంది పాలిట ప్రాణాంతకంగా మారిందన్నారు. ఫ్యాన్‌ ఊడిపడి ఓ వైద్యురాలికి గాయమైందని, రోగులపై పడి ప్రాణాలు పోతే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ఆసుపత్రి నూతన భవనం విషయంలో ప్రభుత్వం తర్వగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని