‘ట్రెసా’ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
eenadu telugu news
Published : 28/10/2021 00:56 IST

‘ట్రెసా’ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

కీసర, న్యూస్‌టుడే: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. బుధవారం కలెక్టరేట్‌ బి బ్లాక్‌లో జరిగిన నూతన కార్యవర్గ ఎన్నిక సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా పి.సుధాకర్‌, అసోసియేట్‌ అధ్యక్షులుగా సంయుక్త, రాజశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా గౌరీవత్సల, విశ్వనాథ్‌, శ్రీనివాస్‌రెడ్డి, ప్రసన్నలక్ష్మి, కార్యదర్శిగా వి.రామకృష్ణారెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా రఘునాథ్‌రెడ్డి, పద్మచారి, సంయుక్త కార్యదర్శులుగా రేణుకాదేవి, లక్ష్మీనారాయణ, అనూష, మల్లారెడ్డి, కోశాధికారిగా పుష్యమి, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా ఉమామహేశ్వర్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా సింధురాణి, కిశోర్‌, విక్టర్‌డేనియల్‌, సాయికిరణ్‌, భానుచందర్‌, నరేష్‌ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీని సన్మానించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని