మద్యం తాగొద్దన్నందుకు తండ్రిపై కత్తితో తనయుడి దాడి
eenadu telugu news
Published : 28/10/2021 02:11 IST

మద్యం తాగొద్దన్నందుకు తండ్రిపై కత్తితో తనయుడి దాడి

గాయపడిన అశోక్‌కు ప్రాథమిక చికిత్స అందిస్తూ అంబులెన్స్‌లో తరలింపు

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: మద్యానికి బానిసై పనీపాటా లేకుండా తిరుగుతున్నావని మందలించినందుకు కన్న తండ్రిపై తనయుడు కత్తితో దాడి చేశాడు. గొంతుకోసి హత్య చేసేందుకు యత్నించాడు. సనత్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను ఇన్‌స్పెక్టర్‌ ముత్తుయాదవ్‌ తెలిపారు. ఫతేనగర్‌లోని శివశంకర్‌నగర్‌కు చెందిన చేపల వ్యాపారి అశోక్‌(55) కుమారుడు కిరణ్‌(38) మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తుండేవాడు. కిరణ్‌కు 11 ఏళ్ల కిందట వివాహం కాగా, ఇద్దరు పిల్లలున్నారు. భార్యకు విడాకులివ్వడంతో ఆమె పిల్లలను తీసుకుని వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఏ పనీ చేయకుండా రోజూ మద్యం తాగుతూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఇబ్బందులు పెడుతుండేవాడు. గతంలో ఒకసారి కూడా తండ్రిపై సీసాతో దాడి చేశాడు. మంగళవారం రాత్రి మద్యంతాగి వచ్చిన కిరణ్‌ను మందలించడంతో తండ్రిపై దాడి చేశాడు. కత్తితో గొంతుకోశాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన అశోక్‌ను ఆసుపత్రికి తరలించారు. బాధితుడు కోలుకున్నాడని, కిరణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని