Suicide: తల్లికి ఫోన్‌ చేసి కుమార్తె ఆత్మహత్య
eenadu telugu news
Published : 28/10/2021 08:27 IST

Suicide: తల్లికి ఫోన్‌ చేసి కుమార్తె ఆత్మహత్య

 భర్తే హత్య చేశాడంటూ కుటుంబీకులు, బంధువుల ధర్నా 

చిలుకూరులో ఉద్రిక్తం


శ్రావణి(అంతరచిత్రంలో) మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: అమ్మా.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ ఫోన్‌ పెట్టేసి ఓ వివాహిత ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మొయినాబాద్‌ సీఐ బి.రాజు, గ్రామస్థుల వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా తూప్రాన్‌కు చెందిన శ్రావణి(26)కి చిలుకూరుకు చెందిన అవురం రాజశేఖర్‌రెడ్డితో గత నవంబరులో పెళ్లయ్యింది. 40 తులాల బంగారం, రూ.40 లక్షలు,  తూప్రాన్‌లో ఎకరం పొలాన్ని కట్నంగా ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం శ్రావణి ఇంట్లో ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కిటికీలో నుంచి శ్రావణి వేలాడుతూ కన్పించడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అమ్మతో మాట్లాడిన కొద్దిసేపటికే..

శ్రావణి బుధవారం తల్లి పద్మకు ఫోన్‌ చేసి మాట్లాడింది. ఈ సమయంలోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఫోన్‌ కట్‌ చేసింది. భయాందోళనకు గురైన తల్లి తిరిగి ఫోన్‌ చేసినా తీయలేదు. అదే సమయంలో ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుంది. కొద్దిరోజులుగా భర్త రాజశేఖర్‌రెడ్డి అదనపు కట్నం కావాలంటూ వేధిస్తున్నట్లు, దసరా పండుగ సమయంలో తీవ్రంగా కొట్టినట్లు కుటుంబీకులు ఆరోపించారు. రాజశేఖర్‌రెడ్డిపై అనుమానం ఉందని.. అతనే తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాజశేఖర్‌రెడ్డి పారిపోయాడు. దీంతో కుటుంబీకులు, బంధువులు, చిలుకూరులో ఆందోళనకు దిగారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకొనే వరకు ఫిర్యాదు చేయమని, మృతదేహాన్ని కదలనిచ్చేది లేదంటూ భీష్మించారు. రాత్రి 8 గంటల వరకు మృతదేహాన్ని తరలించకుండా పోలీసులను అడ్డుకున్నారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని