ఫోన్‌ అమ్మేసి అంత్యక్రియలు చేయాలంటూ లేఖ రాసి బాలుడి ఆత్మహత్య 
eenadu telugu news
Updated : 28/10/2021 08:52 IST

ఫోన్‌ అమ్మేసి అంత్యక్రియలు చేయాలంటూ లేఖ రాసి బాలుడి ఆత్మహత్య 

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, చార్మినార్‌: పాతబస్తీలోని కిషన్‌బాగ్‌లో చిన్న ఇల్లు.. తల్లిదండ్రులు అన్నతో పాటు ఇంట్లో కలిసి ఉంటున్న పదిహేడేళ్ల బాలుడు తనకు వచ్చిన కష్టాన్ని పెద్దదిగా ఊహించుకుని స్వీయ మరణశాసనం రాసుకున్నాడు. నలతగా ఉంటే కొద్దిరోజుల క్రితం ఆసుపత్రికెళ్లి చూపించుకోగా.. వైద్యులు గుండెజబ్బుగా నిర్ధారించడంతో నిర్ఘాంతపోయాడు. విషయం ఎవరికీ చెప్పకుండా ఆవేదనకు లోనయ్యాడు. తండ్రి ఓ సేవా కేంద్రంలో సిబ్బంది.. ఇళ్లల్లో పనులు చేస్తున్న తల్లి.. పదోతరగతితో చదువు ఆపేసి డ్రైవర్‌గా పనిచేస్తున్న అన్న.. తన జబ్బు తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారొద్దని భావించాడు. మంగళవారం ఇంట్లో ఒక్కడే ఉన్నప్పుడు సూసైడ్‌ నోట్‌ రాశాడు. తన చరవాణి అమ్మేసి అంత్యక్రియలు నిర్వహించాలని అందులో పేర్కొన్నాడు. అనంతరం ఉరేసుకున్నాడు. తల్లి ఇంటికి వచ్చేసరికి విగతజీవుడయ్యాడు. బుధవారం పంచనామా పూర్తిచేసిన బహదూర్‌పుర పోలీసులు బాలుడి ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. బాలుడి తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడు గుండెజబ్బు అంటూ తమకు చెప్పలేదంటున్నారు. ఉస్మానియా వైద్యులు ఇవ్వనున్న పోస్టుమార్టం నివేదికలో వివరాల ఆధారంగా బహదూర్‌పుర పోలీసులు చర్యలు చేపట్టనున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని