close

బుధవారం, జులై 17, 2019

ప్రధానాంశాలు

నేటి నుంచి వేసవి సెలవులు

● పని దినాలు కొనసాగించాలంటూ విద్యాశాఖ ఉత్తర్వులు

● తీవ్రంగా వ్యతిరేకించిన ఉపాధ్యాయ సంఘాలు ● 

చివరికి తిరిగి అవసరం లేదంటూ మరో ఉత్తర్వు

పాఠశాల విద్యార్థులు 

 

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : పాఠశాలలు వదిలిన 30 నిమిషాల సమయం తర్వాత సామాజిక మాధ్యమాల్లో పిడుగులాంటి వార్త చక్కర్లు కొట్టింది. అధికారులకు సైతం స్పష్టత లేకపోవడంతో ఉపాధ్యాయులు ఒత్తిడికి గురయ్యారు. విద్యా సంవత్సరం చివరి రోజు కావడంతో ఉపాధ్యాయులు పాలనపరమైన అంశాలపై దృష్టి పెట్టారు. మరోవైపు విద్యాధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పాఠశాల ముగిసే సమయానికి విద్యా సంవత్సరంలో పనిదినాలు తగ్గాయని.. పాఠశాలలనున కొనసాగించాలంటూ విద్యాశాఖ ఉత్తర్వులు వాట్సాప్‌లో ప్రచారం జరిగింది. దీనిపై స్పష్టత రాకముందే విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. పూర్తి సమాచారం వచ్చేసరికి విద్యార్థులు ఇంటికి వెళ్లిపోవడంతో బుధవారం పాఠశాల జరుగుతుందని విద్యార్థులకు ఎలా తెలపాలంటూ ఉపాధ్యాయులు తలలు పట్టుకున్నారు. చివరికి ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో మంగళవారం సాయంత్రం 6.30కు పనిదినాలు అవసరం లేదంటూ మరో ఉత్తర్వులు ఇచ్చారు. గంటల సమయంలో విద్యాశాఖ నుంచి రెండు విభిన్న ఉత్తర్వులు రావడంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.

వాట్సాప్‌లో చక్కర్లు

వేసవి సెలవులు ప్రకటించిన అనంతరం పాఠశాలలకు పనిదినాలు తగ్గాయంటూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే అధిక ఉష్ణ్రోగ్రతల కారణంగా కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు రెండురోజుల కిందటే వేసవి సెలవులు ప్రకటించాయి. సెలవులు కావడంతో పిల్లలు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. వీరంతా మానసికంగా సిద్ధమై ఇతర ప్రాంతాలకు సైతం వెళ్లిపోయారు. ఈ క్రమంలో విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడం.. ఒక్కో విద్యార్థి ఇంటి వద్దకెళ్లి పాఠశాల పనిదినాలపై చెప్పడం సాధ్యం కాదని, ఒకవేళ బుధవారం నుంచి జరిగే పాఠశాలకు పూర్తిస్థాయిలో విద్యార్థులు హాజరుకాకపోతే ఉపాధ్యాయులను బలిపశువులను చేసే అవకాశం ఉందని మనోవేదనకు గురయ్యారు. చివరికి బుధవారం సాయంత్రం 220 పనిదినాలు అవసరం లేదంటూ సీఎస్‌ఈ ఉత్తర్వులు విడుదల చేయడంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.

వేసవి సెలవులు ప్రకటించాం

- తహెరాసుల్తాన, డీఈవో

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలలకు బుధవారం వేసవి సెలవులు ప్రకటించాం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ సెలవులను అమలు చేయాలి. పని దినాలకు సంబంధించి 220 రోజులు నిర్వహించాలని మంగళవారం మధ్యాహ్నం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత వాటిని సవరిస్తూ ముందుగా ప్రకటించిన విధంగానే మంగళవారం నుంచి వేసవి సెలవులుగా నిర్ణయించారు. దీనిపై స్పష్టత లేక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.