close

సోమవారం, ఆగస్టు 19, 2019

ప్రధానాంశాలు

పక్కాగా లెక్కించాకే ఫలితాలు

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత
ప్రదర్శనలు, ఊరేగింపులపై నిషేధం
సువిధ యాప్‌తో  ఎప్పటికప్పుడు సమాచారం
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఏర్పాట్లు
ఈనాడు, హైదరాబాద్‌

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయినట్టు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్‌ తెలిపారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ స్థానాల పరిధిలోని 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో 23న ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు మొదలవుతుందన్నారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ సమావేశ మందిరంలో నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌, అదనపు సీపీ డి.ఎస్‌.చౌహాన్‌, రిటర్నింగ్‌ అధికారులు మాణిక్‌రాజ్‌ కన్నన్‌, రవితో కలసి  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
* 23వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 24 ఉదయం 6 గంటల వరకూ నగరంలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. ప్రదర్శనలు, ఊరేగింపులు, బాణసంచా కాల్చటం, రంగులు చల్లుకోవటం, మద్యం విక్రయాలపై నిషేధం విధించినట్లు చెప్పారు.
* పోస్టల్‌ బ్యాలెట్స్‌, ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపుపై ఎన్నికల సిబ్బందికి  రెండోదఫా శిక్షణను బుధవారం ఏర్పాటు చేశామన్నారు.
* శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం ఏర్పడకుండా లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా కల్పించారు. విధుల్లో పాల్గొనే సిబ్బందికి 23వ తేదీ ఉదయం వారికి కేటాయించే టేబుల్‌ వివరాలు అందజేస్తామన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు.. ప్రతి టేబుల్‌ వద్ద సూపర్‌వైజర్‌, మైక్రో అబ్జర్వర్‌, కౌంటింగ్‌ అబ్జర్వర్‌ ఉంటారన్నారు.
* రాజకీయ పార్టీలు/అభ్యర్థులకు లెక్కింపుపై అవగాహన కల్పించేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు కమిషనర్‌ వివరించారు. కౌంటింగ్‌ ఏజెంట్లకు స్పష్టత ఉండటం వల్ల లెక్కింపు సజావుగా సాగుతుందన్నారు.
* లెక్కింపు కేంద్రం వద్ద సెల్‌ఫోన్ల వినియోగంపై నిషేధం విధించినట్లు వివరించారు. అభ్యర్థులు, ఏజెంట్లు, రిటర్నింగ్‌ అధికారులు సెల్‌ఫోన్‌ తీసుకురాకూడదు. మూడు దఫాలుగా తనిఖీలు చేసిన తరవాతనే లోపలకు అనుమతిస్తామని పేర్కొన్నారు.
* ప్రతిరౌండ్‌ ఫలితాలను సువిధ యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తుంటామన్నారు. వేగంగా ఫలితాలు అందించాలనే ఉద్దేశం లేదని, పూర్తిస్థాయిలో లెక్కింపు పూర్తయ్యాకే విడుదల చేస్తామన్నారు.
* పార్లమెంటరీ స్థానంలోని ప్రతి శాసనసభ స్థానంలోని ఐదు పోలింగ్‌ బూత్‌ల్లోని వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కిస్తామన్నారు. రెండింటి మధ్య ఏదైనా తేడా ఉన్నట్టయితే వీవీప్యాట్‌లను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.
* ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టయితే మిగిలిన రౌండ్లు పూర్తయ్యాక వాటిలోని ఓట్లను లెక్కిస్తామన్నారు. లెక్కింపు ప్రక్రియను వెబ్‌కాస్టింగ్‌ చేయట్లేదన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సిబ్బంది, ఏజెంట్లు, పాత్రికేయులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని దానకిశోర్‌ వెల్లడించారు.
* ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు కేంద్ర, రాష్ట్ర, స్థానిక పోలీసు బలగాలు నిత్యం అప్రమత్తంగా ఉంటాయి. నగరవ్యాప్తంగా 5,200 మంది పోలీసులను బందోబస్తు విధులకు కేటాయించాం. నగరంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా పర్యవేక్షించేందుకు మూడు షిప్టుల్లో సిబ్బంది విధుల్లో ఉంటారు.

 

- అంజనీకుమార్‌, నగర పోలీసు కమిషనర్‌

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.