close

సోమవారం, ఆగస్టు 19, 2019

ప్రధానాంశాలు

ఆధ్యాత్మిక మార్గం.. సాత్విక ఆహారం

న్యూస్‌టుడే, సదాశివనగర్‌
ఆధ్యాత్మిక చింతన వైపు యువకుల మొగ్గు

సదాశివనగర్‌ మండలం లింగంపల్లికి ఓ ప్రత్యేకత ఉంది. గ్రామంలో యువకులందరూ దాదాపు శాకాహారులుగా మారారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండటానికి భక్తి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. సాత్వికాహారాన్ని స్వీకరిస్తూ ఆధ్యాత్మిక చింతన వైపు పయనిస్తున్నారు. కొందరు మహిళలు సన్యాసం తీసుకొని కృష్ణ భగవానుడికి తమ జీవితాన్ని అంకితం చేశారు.

లింగంపల్లిలో 65 ఏళ్ల క్రితం కృష్ణ మందిరం నిర్మించారు. ఆలయ పీఠాధిపతి మాచాలేబాబా ద్వారా ఇప్పటి వరకు సుమారు 80 మంది యువకులు ఉపదేశాన్ని స్వీకరించారు. వీరు మద్యం, మాంసం ముట్టరు. సప్త వ్యసనాలకు దూరంగా ఉంటూ సన్మామార్గంలో నడుస్తున్నారు. మంచి సంకల్పం తీసుకొని జీవితంలో ఉన్నత స్థానం పొందడానికి ప్రయత్నిస్తున్నారు.

స్వచ్ఛందంగా సేవలు
ఏటా శ్రావణ మాసంలో కృష్ణాష్టమి, మార్గశిర మాసంలో దత్తజయంతి వేడుకలు నిర్వహిస్తారు. ప్రతి పౌర్ణమినాడు ప్రత్యేక పూజలు, అన్నదానం చేపడతారు. ఏటా 40 మందికి పైగా మాలధారణ చేస్తారు. మండల, అర్ధ మండల దీక్షలు కొనసాగిస్తూ తమలోని చెడు వ్యసనాలను శాశ్వతంగా వదిలేస్తారు. నిత్యం భగవద్గీత పఠనం చేస్తారు.

సన్మార్గంలో పయనిస్తున్నాం
- రాజేందర్‌
పీఠాధిపతి మాచాలేబాబా ఆధ్వర్యంలో మాలధారణ తీసుకొని, సన్మార్గంలో పయనిస్తున్నాం. శాశ్వతంగా చెడు వ్యసనాలను వదిలివేయాలనే నిర్ణయం తీసుకొని కట్టుబడి ఉంటున్నాం. ఆలయంలో జరిగే ఉత్సవాలకు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నాం.

సప్తవ్యసనాలు జయిస్తున్నారు
యువకులు సప్తవ్యసనాలకు దూరంగా ఉండేలా సూచనలు అందిస్తున్నాం. కృష్ణుడి జీవిత చరిత్రను యువతకు తెలియజేస్తున్నాం. జీవితంలో స్థిరపడాలనే సంకల్పం తీసుకొని, దానికి అనుగుణంగా నడుచుకోవాలని ఉద్బోధిస్తున్నాం.

- మనోహర్‌బాబా, ఆలయ నిర్వాహకుడు

చెడు వ్యసనాలకు దూరం
- అరవింద్‌
దైవ చింతనలో ఆనందం ఉంది. గీతను చదివి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నా. భజనలు చేస్తున్నాం. భక్తిమార్గం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకున్నా. గ్రామంలో 70 శాతం ప్రజలు శాకాహారమే తీసుకొంటున్నారు.

మానసిక ప్రశాంతత
- పూర్ణచందర్‌రావు
భక్తిలో నిమగ్నమైతే మానసిక ప్రశాంతత కలుగుతుంది. దేవుడికి సేవ చేసిన తృప్తి లభిస్తుంది. తోటి మానవులకు తోచిన విధంగా సాయం చేయాలనే ఆలోచన వస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు, వృద్ధులకు సేవ చేస్తున్నా.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.