నకలీ విత్తనాల విక్రయదారులపై పీడీ అస్త్రం  - Vikarabad - EENADU
close

గురువారం, సెప్టెంబర్ 19, 2019

ప్రధానాంశాలు

నకలీ విత్తనాల విక్రయదారులపై పీడీ అస్త్రం 

రైతులను మోసం చేస్తే సహించేది లేదు 
సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌

రాయదుర్గం, న్యూస్‌టుడే: నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై పీడీ చట్టాన్ని సంధించి కటకటాల పాలుచేస్తామని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ.సజ్జనార్‌ పేర్కొన్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన వ్యవసాయ శాఖ అధికారులు, ఎస్‌వోటీ, టాస్క్‌ఫోర్స్‌, శాంతి భద్రత(వివిధ పోలీసు స్టేషన్‌)ల సిబ్బందితో నకిలీ విత్తనాలు అరికట్టడంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రమకోర్చి అందరికీ అన్నంపెట్టే అన్నదాతలు కల్తీ విత్తనాలు, ఎరువుల కారణంగా ఆర్థికంగా కుంగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వారినే మోసం చేసే వారు దేశద్రోహులేనని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

* నకిలీ విత్తనాలు తయారుచేసే కంపెనీలు, సరఫరాదారులను ఉపేక్షించేది లేదు. 
* కల్తీ విత్తనాలను మార్కెట్‌లోకి అడ్డదారిలో సరఫరా చేసేవారిని, విక్రయించే వ్యాపారులు, ఏజెంట్లను గుర్తించి పీడీచట్టం కింద కేసులు పెట్టి కటకటాల పాలు చేస్తాం. 
* వర్షాకాలం సమీపిస్తుండడంతో రైతన్నలు పంటలు పండించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో నకలీ, కల్తీ విత్తనాలు, ఎరువులను అంటగట్టేందుకు మోసగాళ్లు వస్తుంటారు. వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. 
* గ్రామాల్లోకి వచ్చి విత్తనాలు అమ్మేవారి వద్ద, దళారులనుంచి కొనుగోలు చేయకూడదు. వాటికి ప్రభుత్వం నుంచి అనుమతి ఉండదు. 
* సీడ్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ దుకాణదారులు నిబంధనల ప్రకారం వ్యాపారాలు చేసుకోవాలి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులనే అందిచాలి. 
* వ్యవసాయ శాఖ ధ్రువీకరించిన విత్తన డీలర్లు, దుకాణ దారులవద్ద నాణ్యమైన విత్తనాలు లభిస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలి. 
* నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే మోసగాళ్లపై నిఘా పెడతాం. వ్యవసాయ శాఖ, పోలీసు విభాగాలతో ప్రత్యేక తనీఖీలు చేపడతాం.. 
* ఎవరైనా బలవంతంగా కల్తీ విత్తనాలు, ఎరువులు అంటగట్టినా, విక్రయిస్తున్నట్లు తెలిసినా వెంటనే సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ వాట్సాప్‌ నంబరు 94906 17444, డయల్‌ 100, సంబంధిత పోలీసుస్టేషన్‌లకు ఫోన్‌ చేసి సమాచారం అందించాలి. నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. 
సమావేశంలో శంషాబాద్‌, మాదాపూర్‌, క్రైం డీసీపీలు ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, రోహిణి ప్రియదర్శిని, ఎస్‌వోటీ, ఎస్‌బీ అదనపు డీసీపీలు దయానంద్‌రెడ్డి, గౌస్‌మొహియుద్దీన్‌, ఎస్‌బీ, పేట్‌బషీర్‌ బాద్‌ ఏసీపీలు రవీందర్‌రెడ్డి, నరసింహారావు, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల వ్యవసాయాధికారులు ఎస్‌.గీత, శోభారాణి, రాజేంద్రనగర్‌ ఏడీ లీనా, ఎస్‌వ్ణో10్ణ10 ఇన్‌స్పెక్టర్‌లు ప్రవీణ్‌రెడ్డి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.