close

గురువారం, ఆగస్టు 22, 2019

ప్రధానాంశాలు

ప్రాచీన మసీదులు...ప్రత్యేక ప్రార్థనా నిలయాలు 

న్యూస్‌టుడే, కొడంగల్‌

జిల్లాలో శతాబ్దల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రాచీన మసీదులు ప్రార్థనా మందిరాలుగా నిత్యం భక్తి భావం పంచుతున్నాయి. ఏటా పవిత్ర రంజాన్‌ మాసంలో ఇలాంటి పురాతన ప్రార్థనా మందిరాల్లో నమాజు చేయడానికి ముస్లింలు ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. జిల్లాలోని కొడంగల్‌, కుల్కచర్ల, తాండూరు, పరిగి పట్టణ ప్రాంతాల్లో పురాతన మందిరాలు నెలకొని ఉన్నాయి. వీటిలో కొడంగల్‌ నియోజకవర్గంలోనే అత్యంత పురాతనమైన మసీదు కొడంగల్‌ మండల కేంద్రంలో ఉంది. ఈ మసీదులో రంజాన్‌ ప్రార్థనలు చేయడంతో పాటు ఉపవాస దీక్షలు విరమణ చేస్తుంటారు. కొడంగల్‌ మండలంలో మొత్తం 18 మసీదులు ఉండగా పట్టణంలోని జామా మసీదు అత్యంత పురాతనమైనదిగా ముస్లిం మత పెద్దలు పేర్కొంటారు.

417 సంవత్సరాల క్రితం నాటి జామా మసీదు 
పట్టణంలో జామా మసీదు అత్యంత పురాతనమైంది. నిజాం నవాబుల కాలంలో ఇస్లామిక్‌ క్యాలెండర్‌ ప్రకారం 1023లో నిర్మాణం చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇస్లామిక్‌ క్యాలెండర్‌ తేదీ ప్రకారం 1023 కంటే దాదాపు 80 సంవత్సరాల ముందే దీని నిర్మాణం చేసినట్లు ఉంది. ఇస్లామిక్‌ క్యాలెండర్‌ తేదీ ప్రకారం తామిప్పుడు 1440 సంవత్సరంలో ఉన్నామని ముస్లిం మతపెద్దలు తెలియజేస్తున్నారు. సుమారు 417 సంవత్సరాల కంటే మందు నిర్మాణం చేసిన ఈ మసీదు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ముస్లిం సోదరుల ప్రార్థన అవసరాలకు అనుగుణంగా పురాతన కట్టడాన్ని అలాగే ఉంచుతూ ముందు భాగంలో మసీదును విస్తరించారు.

* కొడంగల్‌ ట్టణంలోనే అత్యంత పురాతన కాలనీ అయినా సంతబజార్‌ సమీపంలో జామా మసీదు నిర్మించారు. నాడు కేవలం 50 మంది వరకు ప్రార్థనలు చేసుకొనేవారు. కాలనుగుణంగా టెంట్లు, షామీయానాలు వేసి ప్రార్థనలు చేశారు. ప్రస్తుతం మసీదును విస్తరించడంతో దాదాపు 500 మంది వరకు ప్రార్థనలు చేస్తున్నారు. అలాగే కుల్లచర్ల మండలంలోని ముజాహిద్‌పూర్‌లో సైతం 400 సంవత్సరాల క్రితంనాటి మసీదు ఉంది.

75 సంవత్సరాల క్రితం... 
దాదాపు 75 సంవత్సరాల క్రితం కొడంగల్‌ తహసీల్దారు కార్యాలయం సమీపంలో మక్కామసీదు నిర్మించారు. అప్పట్లో ఈ మసీదు చివరగా ఉండేది. ఈ మసీదుకు సమీపంలోనే పాత బస్టాండ్‌ ఉండేది. పాత బస్టాండ్‌ వద్ద బస్సులు కొంత సేపు నిలిపి వెళ్లి పోయేవారు. ఆ పైన ఊరు ఉండేదికాదు. మొత్తం పొలాలతో నిండి ఉండేది. మక్కా మసీదు నిర్మాణశైలి కూడా జామా మసీదును పోలి ఉంది. పై కప్పునకు శ్లాబ్‌తో నిర్మించారు. ఈ కట్టడ నిర్మాణంలోను రాయిని వాడారు. చారిత్రకత దెబ్బతినకుండా ఉండటానికి పాత నిర్మాణం చెడిపోకుండా అలాగే ఉంచి ముందు భాగంలో మసీదును విస్తరించారు.

* కొడంగల్‌ పట్టణంలోని నాలుగు మసీదుల్లో జామా మసీదు, మక్కామసీదు, ఇబ్రహీం మసీదు, ఉమర్‌బిన్‌ఖతబ్‌లు ప్రత్యేకమైనవి. కొడంగల్‌ మండలం హస్నాబాద్‌ గ్రామ శివారులో ఉన్న మసీదు సైతం 400 సంవత్సరాల కంటే పూర్వం నిర్మాణం చేసినట్లు ఆధారాలు ఉన్నాయని మత్తపెద్దలు అంటున్నారు. ఈ మసీదులకు సరిహద్దుగా ఉన్న వాటికి ఎక్కువ మంది జామా మసీదు ప్రార్థనల్లో మొగ్గు చూపుతున్నారు. రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్ష విరమణకు సాయంత్రం ఆ ప్రార్థనాలయాలకు వెళ్తున్నారు. ప్రతి శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలకు జామా మసీదుకు వెళ్లడానికి అసక్తి చూపుతుంటారు.

పరిగి, న్యూస్‌టుడే: పవిత్ర రంజాన్‌ పండగకు పరిగి నియోజకవర్గంలోని మసీదులు ప్రత్యేకంగా ముస్తాబవుతున్నాయి. రంగురంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వచ్చే నెల 5న జరగనున్న పండగకు నిర్వాహకులు సర్వ సన్నాహాలు చేస్తున్నారు. విద్యుద్దీపాల సొబగులను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కన్నా ఈసారి పండగను పెద్దఎత్తున నిర్వాహించాలని మైనార్టీ నాయకులు భావిస్తున్నారు. 
భక్తి భావం పెరుగుతుంది. 
మసీదులలో ప్రార్థనలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతుంది. శతాబ్దాల తరబడి ఉన్న మసీదులు వాటి చరిత్రను చాటడమే కాదు ప్రజలో భక్తిభావాన్ని కూడా పెంపొందిస్తాయి. ఎందుకంటే వాటిని చూడగానే ప్రార్థన చేయాలనే తలంపుతోపాటు గత ప్రార్థనా సంగతులు కూడా గుర్తుకు వస్తాయి. తద్వారా మనసు ఎంతో ఉత్తేజితం అవుతుంది. ఆధ్యాత్మికతతో నిండిపోతుంది. కొడంగల్‌లో ఉన్న మసీదు దాదాపు జిల్లాలోనే అతిపురాతన మసీదుగా పేరు గాంచింది. పాతకొడంగల్‌లో పూర్తిగా పడిపోయింది.

-అబ్దుల్‌ రషీద్‌,  ముస్లిం మత పెద్ద, కొడంగల్‌

అరబ్బీ తరగతులు 
ప్రతి రోజు ఉదయం సాయంత్రం జామామసీదులో అరబ్బీ తరగతులు నిర్వహిస్తున్నామని మత పెద్దలు తెలిపారు. ఈ తరగతులు పవిత్ర ఖురాన్‌ను  తెలుసుకొనేందుకు ఎంతో ఉపయోగపడుతుంటాయని తెలిపారు. అరబ్బీ తరువాత ఉర్దూ ఇతర తరగతులు యధావిధిగా ఉంటాయన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.