close

ఆదివారం, జూన్ 16, 2019

ప్రధానాంశాలు

నంద్యాలలో కాంగ్రెస్‌కు స్వల్ప ఓట్లు

నంద్యాల, న్యూస్‌టుడే: ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్‌కు పోలైన ఓట్లను పరిశీలిస్తే నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో అతితక్కువగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పోలయ్యాయి. నంద్యాల కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన చింతల మోహన్‌రావుకు కేవలం 1114 ఓట్లు పడ్డాయి. మొత్తం పోలైన ఓట్లల్లో 0.56 శాతం మాత్రమే ఆయనకు నమోదయ్యాయి. గతంలో 2017 ఉప ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గడ్డం అబ్దుల్‌ ఖాదర్‌కు 1382 ఓట్లు రాగా 2014 ఎన్నికల్లో జె.రాకేష్‌ రెడ్డికి 2,459ఓట్లు పడ్డాయి. ఈ ఎన్నికల్లో బనగానపల్లి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి పి.హరిప్రసాద్‌ రెడ్డికి 2166, ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసిన సీహెచ్‌.పుల్లయ్యకు 2,626, శ్రీశైలం నుంచి బరిలో నిలిచిన నాయబ్‌ సయ్యద్‌ తస్లీమాకు 1190, నందికొట్కూరు అభ్యర్థి అశోక్‌రత్నంకు 1,668, డోన్‌ అభ్యర్థి వెంకట శివారెడ్డికి 1,572, పాణ్యం అభ్యర్థి ఎం.నాగమధు యాదవ్‌కు 2,462 ఓట్లు పడ్డాయి. ఇక ఆదోనిలో పోటీ చేసిన బి.నీలకంఠప్పకు 2,151, ఆలూరు అభ్యర్థి డి.ఆశాబేగానికి 2,776, ఎమ్మిగనూరు అభ్యర్థి కె.లక్ష్మీనారాయణ రెడ్డికి 2,684, కర్నూలు అభ్యర్థి జాన్‌ విల్సన్‌కు 3,388, పత్తికొండ అభ్యర్థి బి.క్రాంతినాయుడుకు 2,385, కోడుమూరు నుంచి పోటీ చేసిన దామోదరం రాధాకృష్ణమూర్తికి అత్యధికంగా 3,616, మంత్రాలయం నుంచి పోటీ చేసిన శివప్రకాష్‌ రెడ్డికి 1912 ఓట్లు లభించాయి. ఇక నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన జె.లక్ష్మీనరసింహ యాదవ్‌కు 14,420 ఓట్లు లభించాయి. పోలైన వాటిలో 1.11 శాతం నమోదయ్యాయి. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన అహ్మద్‌ అలీఖాన్‌కు 3.07శాతం అంటే 36,258 ఓట్లు లభించాయి. దీంతో కాంగ్రెస్‌కు పోలైన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే అతిస్వల్పంగా నంద్యాల అభ్యర్థి చింతల మోహన్‌ రావుకు లభించాయి.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.