close

మంగళవారం, జూన్ 25, 2019

ప్రధానాంశాలు

బుగ్గనను మంత్రి పదవి వరించేనా?

తన వాక్చాతుర్యంతో ప్రత్యేక గుర్తింపు

డోన్‌ కోటలో సుస్థిర స్థానం

ఎమ్మెల్యేను గజమాలతో సత్కరిస్తున్న కార్యకర్తలు

డోన్‌, న్యూస్‌టుడే: కోట్ల, కేఈ కుటుంబాల రాజకీయ పోరుగడ్డగా ఉన్న డోన్‌ కోటలో బుగ్గన పాగా వేశారు. రెండోసారి 35,516 ఓట్ల భారీ ఆధిక్యంతో ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఎప్పుడూ ప్రత్యర్థులుగా తలపడే కోట్ల, కేఈలు డోన్‌లో ఈసారి కలసిపోయి బరిలో నిలిచారు. అయినా ప్రజలు ఆ రెండు కుటుంబాలను కాదని బుగ్గనకే భారీ విజయం కట్టబెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్‌ ప్రభావంతో పాటు డోన్‌లో బుగ్గన తన ప్రభావాన్ని చాటుకున్నారు. వైకాపా అధినేత జగన్‌తో ఉన్న సాన్నిహిత్యంతో మంత్రి పదవి కచ్చితంగా వరిస్తుందని భావిస్తున్నారు. కీలకమైన శాఖలో బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. బేతంచెర్లకు చెందిన బుగ్గన రాజారెడ్డి సర్పంచిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. వారి కుటుంబం ఎన్నో దశాబ్దాలుగా రాజకీయంగా ఉన్నారు. బుగ్గన రాజారెడ్డి తాత బుగ్గన శేషారెడ్డి 1955లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి డోన్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995లో బుగ్గన రాజారెడ్డి బేతంచెర్ల మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచిగా ఎన్నికయ్యారు. పదేళ్ల పాటు కొనసాగారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తదనంతరం జరిగిన పరిణామాలతో వైకాపాలో చేరారు. 2014లో డోన్‌ బరిలో నిలిచి కేఈ ప్రతాప్‌పై 11,152 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రెండోసారి డోన్‌ బరిలో నిలిచి గెలిచారు.

తొలిసారే పీఏసీ ఛైర్మన్‌ పదవి

వైకాపా తరఫున తొలిసారిగా గెలిచిన బుగ్గనకు మొదటిసారే పార్టీలో మంచి ప్రాధాన్యం లభించింది. ఎంతో మంది సీనియర్లను కాదని బుగ్గనకు పీఏసీ ఛైర్మన్‌ పదవిని ఇచ్చారు. శాసనసభలో తన వాక్చాతుర్యంతో బుగ్గన రాష్ట్ర ప్రజలను ఆకట్టుకున్నారు. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. బడ్డెట్‌ పరిశీలించడం, తనశైలిలో సుతిమొత్తగా ప్రభుత్వానికి చురకలు అంటించడం చేశారు. తన ప్రతిభతో అటు పార్టీలోనూ కీలకంగా మారారు. ప్రజలలోనూ గుర్తింపు సాధించి నియోజకవర్గానికి వన్నెతెచ్చారు. రెండోసారి వైకాపా తరఫున గెలవడం, అదే పార్టీ అధికారంలోకి రావడంతో ఆయనకు కచ్చితంగా మంత్రి పదవి వరిస్తుందని ప్రజలు భావిస్తున్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.