close

మంగళవారం, జూన్ 25, 2019

ప్రధానాంశాలు

మహాయోగి లక్ష్మమ్మవ్వ మహా రథోత్సవం నేడు
ఏర్పాట్లు పూర్తి● భారీ పోలీసు బందోబస్తు
రథోత్సవానికి సిద్ధంగా వెండి రథం

ఆదోని సాంస్కృతికం, ఆదోని పట్టణం, న్యూస్‌టుడే : ఆదోని ఇలవేల్పు మహాయోగి లక్ష్మమ్మవ్వ మహారథోత్సవ కార్యక్రమం నేడు నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రథోత్సవం పురస్కరించుకుని ఆలయానికి విద్యుత్తు దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం 3గంటల నుంచే ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో రానుండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండ ఆలయ ధర్మకర్త రాచోటి రామయ్య ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు నిలబడేందుకు బ్యారికేడ్లు, ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు షెడ్లు ఏర్పాట్లు చేశారు. ఉదయం ఆలయంలో అమ్మవారికి బెంగుళూరు నుంచి వచ్చిన కళాకారులు ప్రత్యేకంగా అలంకరించనున్నారు. అమ్మవారికి పంచామృతాభిషేకం, పుష్పార్చన, మహామంగళహారతి వంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేస్తారు. సాయంత్రం 4గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఆశీనులను చేసి పురవీధుల్లో వెండి మహారథోత్సవం నిర్వహించనున్నారు. స్థానిక షరాఫ్‌బజారు నుంచి ప్రారంభమయ్యే రథోత్సవం హవన్నపేట కూడలి, వెంకటనర్సప్ప ఆలయం, పూలబజారు, ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌ కూడలి మీదుగా షరాఫ్‌బజారుకు చేరుతోంది. వేలాది భక్తులు రథోత్సవంలో పాల్గొననున్నారు.

భారీ పోలీసు బందోబస్తు

ఆదోని పట్టణంలో శనివారం మహాయోగి లక్ష్మమ్మవ్వ మహారథోత్సవం పురస్కరించుకుని పట్టణంలో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆదోని డీఎస్పీ వెంకటరాముడు తెలిపారు. పోలీసులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండ పకడ్బందిగా బందోబస్తు నిర్వహించాలన్నారు. ఒక డీఎస్పీ, 9 మంది సీఐలు, 20 మంది ఎస్సైలు, 25 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 200 మంది కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొననున్నారు. రథోత్సవం సందర్భంగా ప్రత్యేక పోలీసు బలగాలు, స్టైకింగ్‌ ఫోర్సులు, సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.