close

మంగళవారం, జులై 16, 2019

ప్రధానాంశాలు

స్వచ్ఛంగా తీర్చిదిద్దుదాం

 
ప్రదర్శనగా వెళుతున్న విద్యార్థినులు, అధికారులు, అధ్యాపకులు

 

కర్నూలు బీక్యాంపు, న్యూస్‌టుడే : జూన్‌ 1 నుంచి 15వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి బోర్డు కర్నూలు ప్రాంతీయ శాఖ, కేవీఆర్‌ డిగ్రీ(మహిళా) కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛ పక్వాడ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో భాగంగా శనివారం రైల్వేస్టేషన్‌ నుంచి కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయ అధికారి బి.వై.మునిప్రసాద్‌ మాట్లాడుతూ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలన్నదే ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యమన్నారు. నగరం అందంగా ఉండాలంటే ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకూడదన్నారు. పర్యావరణంపై చిత్రలేఖనం, వ్యాసరచన తదితర విభాగాల్లో గెలుపొందిన విద్యారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేవీఆర్‌ కళాశాల అధ్యాపకురాలు వసుంధర, విద్యార్థినులు పాల్గొన్నారు. అనంతరం కళాశాల పరిసర ప్రాంతాల్లో శ్రమదానం చేశారు.

 
మొక్క నాటుతున్న కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌, డీఈవో తహెరాసుల్తాన


మౌలిక వసతుల కల్పనకు చర్యలు

 
ఉపకార వేతనాలు అందుకున్న పోలీసుల పిల్లలతో దళాధిపతి ఎస్‌.కె.హుస్సేన్‌సాహెబ్‌

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగా కర్నూలు మండలం పంచాలింగాల జడ్పీ పాఠశాలలో నాలుగో రోజైన శనివారం వందన-అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌, కలెక్టర్‌ వీరపాండియన్‌ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. గత విద్యా సంవత్సరంలో ‘పది’ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. డీఈవో తహెరాసుల్తాన, పీవో తిలక్‌ విద్యాసాగర్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓంకార్‌ యాదవ్‌, తహసీల్దార్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.


తల్లిదండ్రులను మరవద్దు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : ఎంత ఉన్నతస్థాయికి ఎదిగినా తల్లిదండ్రులను మరిచిపోకూడదని ఏపీఎస్పీ రెండో పటాలం దళాధిపతి ఎస్‌.కె.హుస్సేన్‌సాహెబ్‌ అన్నారు. 2017-18లో పది, ఇంటర్‌, బీటెక్‌, ఎంబీబీఎస్‌లో ఉత్తమ మార్కులు సాధించిన ఏపీఎస్పీ రెండో పటాలం పోలీసు పిల్లలకు మెరిట్‌ స్కాలర్‌షిప్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం నగరంలోని రెండో పటాలం కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు పిల్లలు అన్ని రంగాల్లో ప్రతిభ చూపుతుండడం అభినందనీయమన్నారు. ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని సాధించేవరకు అహర్నిశలు శ్రమించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పటాలం పరిపాలనాధికారి వై.జయరాజ్‌, సహాయ దళాధిపతులు ఎస్‌.ఎం.బాషా, శశికాంత్‌, జయప్రసాద్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.