తాగునీటిలో పురుగులు రావడమేంటీ?   - Kurnool - EENADU
close

బుధవారం, సెప్టెంబర్ 18, 2019

ప్రధానాంశాలు

తాగునీటిలో పురుగులు రావడమేంటీ?  

 తప్పులు చేస్తే అధికారులపైనా క్రిమినల్‌ కేసులు

 కలెక్టర్‌ వీరపాండియన్‌ హెచ్చరిక

 

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : కోడుమూరులో తాగునీటి కోసం ప్రజలు బిందెలు పట్టుకుని పరుగులు తీస్తున్నారని, తాగునీటిలో పురుగులు రావడమేంటని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం అనంతరం ఆయన జిల్లా అధికారులతో శనివారం సమీక్షించారు. ఈ విషయంలో ఎవరినీ వదలమని, క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించారు. అధికారులైనా.. ఎవరైనా వదిలేది లేదని, తప్పులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజల దాహార్తి తీర్చే విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, నీటిని క్లోరినేషన్‌ చేయకుండా ఎలా సరఫరా చేస్తారని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈని నిలదీశారు. ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూడాలన్నారు. గాజులదిన్నె రిజర్వాయర్‌ నుంచి నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ ఎస్‌ఈని ఆదేశించారు. కోడుమూరులో చాలా ప్రాంతాల్లో కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, గతంలో ఎందుకు కాలువల పనులు చేపట్టలేదని డీపీవోను ప్రశ్నించారు.

●* పత్తికొండ మండలంలో పాఠశాలలు తెరచి నాలుగు రోజులైనా విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు ఇవ్వలేదని, వంద శాతం పంపిణీ చేయాలని విద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం తన తనిఖీల్లో ఈ వాస్తవాలు వెలుగు చూశాయన్నారు.

*● దేవనకొండ, పత్తికొండతోపాటు అన్ని పాఠశాలల్లో విద్యుత్తు, కిటికీలు, తలుపులు.. ఇలా అన్నీ ఉన్నాయా పని పరిశీలించి నివేదికలు ఇవ్వాలని విద్యాశాఖ, ఎస్‌ఎస్‌ఏ పీవోకు సూచించారు.

*● దేవనకొండ మండలంలోని కొత్తపేట-తెర్నేకల్‌ రోడ్డు గుంతలమయంగా ఉందని, క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు ఇవ్వాలని పీఆర్‌ ఎస్‌ఈని కలెక్టర్‌ ఆదేశించారు.

*● గత రెండేళ్లుగా సంజామల, కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, బనగానపల్లి, నంద్యాల, నందికొట్కూరు ప్రాంతాలో 12 లక్షల క్వింటాళ్ల శనగలు గోదాముల్లో నిల్వ ఉన్నాయని, మద్దతు ధర రూ.4,300 ఉన్నా రైతులు విక్రయించడం లేదని చాలామంది గోదాముల్లో నిల్వ ఉంచుకున్నారని వ్యవసాయశాఖ జేడీ ఠాగూర్‌ నాయక్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయమై వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ ఏడీ, ఎల్‌డీఎంలు రైతులతో చర్చించాలన్నారు. కనీస మద్దతు ధర వచ్చేలా నచ్చజెప్పి ఉత్పత్తులను అమ్ముకునేలా చూడాలన్నారు.

*● ఆర్థికేతర సమస్యల్లో ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్‌లో ఉండకూడదని, ఫిర్యాదులపై ప్రతి వారం శాఖలవారీగా సమీక్షిస్తామన్నారు.

*● కలెక్టర్‌ నిర్వహించే సమీక్షలు, మీకోసం ప్రజాదర్బార్‌, డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాలకు అధికారులు గైర్హాజరైతే చర్యలు తప్పవని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కలెక్టర్‌ అనుమతి తీసుకోవాలన్నారు.

*● పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు రానున్నాయని, వీటికి అధికారులు సహకారమందించాలని కలెక్టర్‌ అన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఎక్కడా ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.