close

శనివారం, జులై 20, 2019

ప్రధానాంశాలు

ప్లాస్టిక్‌ రహిత నగరంగా హైదరాబాద్‌

ఎంఎనగర్‌లో గ్రేటర్‌ కమిషనర్‌ ఆకస్మిక తనిఖీ

మియాపూర్‌, న్యూస్‌టుడే: గ్రేటర్‌ హైదరాబాద్‌ను ప్లాస్టిక్‌ రహిత నగరంగా రూపొందించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ తెలిపారు. నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగంపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 200 టన్నులకు పైగా ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించామన్నారు. అదే విధంగా భూగర్భ జలమట్టాలను పెంచేలా వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా జీహెచ్‌ఎంసీ జలమండలితో పాటు కాలనీ సంక్షేమ సంఘాల సహకారంతో ఇంకుడుగుంతల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. సాఫ్‌ హైదరాబాద్‌, షాన్‌దార్‌ హైదరాబాద్‌లో భాగంగా నగరంలో స్వచ్ఛ కార్యక్రమాల నిర్వహణలో స్వచ్ఛంద సంస్థలు కాలనీ సంఘాలు, స్థానికులను ప్రత్యక్షంగా భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు. 100శాతం స్వచ్ఛత సాధించడమే లక్ష్యం అన్నారు. శనివారం ఆయన చందానగర్‌ సర్కిల్‌ పరిధిలోని మియాపూర్‌ డివిజన్‌ ఎంఎనగర్‌లో ఆకస్మికంగా పర్యటించారు. గ్రేటర్‌ పరిధిలో ఈ కార్యక్రమం తీరుతెన్నుల గురించి అధికారులతో సమీక్షించారు.
స్థానికుల నుంచి సమాచార సేకరణ..
చెత్త ఆటోల పనితీరు, తడిపొడి చెత్త వేరుగా నిల్వచేసే విధానం, ప్లాస్టిక్‌ కవర్ల నివారణ, దోమల నిరోధక చర్యలు, ఇంకుడు గుంతల కంపోస్టింగ్‌ విధానంపైన దానకిషోర్‌ స్థానికులతో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న ఇంకుడు గుంతల పునరుద్ధరణలో పాల్గొన్న కమిషనర్‌ కాలనీలో మొక్కలు నాటారు. సాఫ్‌ హైదరాబాద్‌, షాన్‌దార్‌ హైదరాబాద్‌ .. బస్తీల్లో అమలవుతున్న తీరు గురించి వెస్ట్‌ జోన్‌ కమిషనర్‌ హరిచందన, చందానగర్‌ సర్కిల్‌ ఉపకమిషనర్‌ యాదగిరిరావు కమిషనర్‌కు వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఇదే రీతిలో ప్రతిష్టాత్మకంగా కొనసాగించాలని కమిషనర్‌ అధికారులకు సూచించారు. అనంతరం బస్తీలో సంకల్ప ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉన్న జూట్‌బ్యాగుల తయారీ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. శిక్షణ పొందిన మహిళలకు దానకిషోర్‌, హరిచందన ధ్రువపత్రాలు అందజేశారు. స్థానికంగా ఉన్న చిన్నారులకు రాతపుస్తకాలు అందజేశారు. జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం అధికారి డాక్టర్‌ వకీల్‌, వైద్యాధికారి డాక్టర్‌ రవి, టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీలు హరి, శ్రీనివాస్‌, పీవో వత్సలాదేవి, టీపీఎస్‌లు పవన్‌, ఉమాదేవి, పారిశుద్ధ్య విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్‌, సంకల్ప ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు రోజి, స్థానికులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.