close

మంగళవారం, జులై 23, 2019

ప్రధానాంశాలు

సరిహద్దు పల్లెకు ఖజనా

న్యూస్‌టుడే, మద్నూర్‌

జిల్లా కేంద్రానికి సుదూరంగా మహారాష్ట్ర సరిహద్దున మారుమూల ప్రాంతమైన మద్నూర్‌ మండలంలోని 23 పల్లెల ప్రజలు ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సంకల్పించి గత మూడేళ్లుగా వందశాతం పన్నులు చెల్లించడం విశేషం.

మద్నూర్‌ మండలం 34 పంచాయతీల పరిధిలో 38 గ్రామాలు ఉన్నాయి. మండల వ్యాప్తంగా రూ.58,80,593 పన్నుల వసూళ్ల లక్ష్యం ఉండగా.. ఇప్పటి వరకు రూ.52,49047 వసూలు(89.26 శాతం) చేసినట్లు ఈవోపీఆర్టీ నాగరాజు తెలిపారు.
ప్రజల సహకారంతోనే

- ఆశ, సర్పంచి సుల్తాన్‌పేట్‌

 

గ్రామాల్లో చాలా మంది ప్రజలు నిరక్ష్యరాసులు ఉన్నారు. వారందరికి పన్నులు చెల్లించాలని అవగాహన కల్పించాం. తద్వారా గ్రామం అభివృద్ధి చెందుతుందని వారికి తెలియజేశాం. దీంతో వారిలో చైతన్యం వచ్చి వందశాతం పన్నులు చెల్లించారు. గ్రామస్థులందరు సహకరించడంతో సాధ్యమైంది.

అవగాహన కల్పించడం వల్లే
- విఠల్‌ గురూజీ, సర్పంచి మేనూర్‌
గతంలో పంచాయతీకి ప్రజలు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించే వారు కాదు. ఇలా ఏళ్లుగా కొనసాగుతునే వచ్చింది. గతంలో పని చేసిన సర్పంచులు కూడా పన్నుల వసూళ్లపై అంతగా దృష్టి సారించే వారు కాదు. ప్రస్తుతం అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ పన్నులు చెల్లించాలని ప్రజలకు అవగాహన కల్పించడం వల్ల వందశాతం పన్నులు చెల్లించారు.

గ్రామాభివృద్ధికి తప్పని సరి
- హారిక, సర్పంచి, పెద్దఎక్లార
ఏ పంచాయతీ అయినా సరే అభివృద్ధి చెందాలంటే ప్రజలు వందశాతం పన్నులు చెల్లించాలి. అయితేనే గ్రామాలు అభివృద్ధి పథంలో నడుస్తాయి. ఇంతకు ముందు పన్నులు చెల్లించాలని ప్రజలను అడిగేవారు లేరు. ఇప్పుడు అడుగుతున్నారు కనుక చెల్లిస్తున్నారు.

ప్రజల భాగస్వామ్యం
- గఫర్‌, సర్పంచి, చిన్నశక్కర్గ
ప్రజల భాగస్వామ్యం ఉంటే గ్రామంలో ఎంతటి అసాధ్యమైన పనైనా సరే సాధించవచ్చు. వందశాతం పన్నులు వసూలు అయితే గ్రామాల్లో సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ప్రజలకు ఇప్పుడిప్పుడే ఈ విషయంపై అవగాహన వస్తోంది.

అన్నింట్లో వసూలుకు కృషి
- నాగరాజు, ఈవోపీర్డీ
23 పంచాయతీల్లో గత మూడేళ్లు వందశాతం పనులు చెల్లిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో మిగతా పంచాయతీల్లో కూడా వందశాతం పన్నులు వసూలు చేసి జిల్లాలోనే మద్నూర్‌ మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. నేను ఇక్కడ ఉద్యోగ బాధ్యతలు తీసుకున్న సమయంలో 20 శాతం మాత్రమే పన్నులు వసూలు అయ్యేవి. ప్రస్తుతం 90 శాతానికి చేరువలో ఉన్నాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.