గణిత వికాసానికి అబాకస్‌ దోహదం - Kurnool - EENADU
close

శనివారం, సెప్టెంబర్ 21, 2019

ప్రధానాంశాలు

గణిత వికాసానికి అబాకస్‌ దోహదం

మాట్లాడుతున్న రాష్ట్ర పరిశీలకురాలు లక్ష్మీవాట్స్‌

డోన్‌ పట్టణం, న్యూస్‌టుడే: పిల్లల్లో గణితం పట్ల భయం పోగొట్టి ఆసక్తి పెంపొందించేలా చేయాల్సిన బాధ్యత గణిత ఉపాధ్యాయులపై ఉందని రాష్ట్ర పరిశీలకురాలు లక్ష్మీవాట్స్‌ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎస్కేపీ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి గణితంలో అబాకస్‌ శిక్షణ ఎంతో దోహదపడుతుందన్నారు. మూడు రోజులపాటు ఆర్పీలు ఇచ్చే శిక్షణలో నైపుణ్యాలు పెంపొందించుకుని విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంచేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. పిల్లలు గణితం అంటే భయపడుతూ డ్రాపౌట్‌ అవుతున్నారని, ఆ పరిస్థితి లేకుండా పిల్లల్లో ఆసక్తి, ఇష్టం కలిగించేలా చూడాలన్నారు. శిక్షణ తీరుపై ఆర్పీలకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి ప్రసాద్‌, ఆర్పీలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.