close

బుధవారం, జులై 17, 2019

ప్రధానాంశాలు

‘రూర్బన్‌’ నిలిచి... ఆగిన ప్రగతి

 ఎన్నికలు ముగిసినా మొదలవని పనులు
 పడకేసిన పట్టణ తరహా సౌకర్యాలు
న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

పట్టణాల్లో ఉండే విధంగాలోనే గ్రామాల్లోనూ మౌలిక సదుపాయాలను కల్పించి అభివృద్ధి చేయాలన్న లక్ష్యం నీరుగారుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పథకం ‘రూర్బన్‌’ అమలు క్షేత్రస్థాయిలో పడకేసింది. ఏకంగా సంవత్సరంపాటు కసరత్తు చేసి రూపొందించిన ప్రణాళికలు కార్యరూపం దాల్చడంలో తాత్సారం జరుగుతోంది. వెరసి రూ.కోట్లాది రూపాయలు మంజూరైనా పల్లెలు ప్రగతికి నోచడం లేదు. ఇప్పటివరకు అధికారులు ఎన్నికల విధుల్లో తలమునకలయ్యారు. తాజాగా ఆ క్రతువు ముగిసినందున రూర్బన్‌ ఫలాలను ప్రజల చెంతకు తీసుకెళ్లాల్సి ఉంది. ఇవీ వివరాలు...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేస్తున్న శ్యామాప్రసాద్‌ ముఖర్జీ మిషన్‌ రూర్బన్‌ పథకానికి వికారాబాద్‌ జిల్లాలో తాండూరు మండలం ఎంపికైంది. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో అధికార యంత్రాంగం ఏడాదిన్నరపాటు సుదీర్ఘ కసరత్తు అనంతరం 38 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు రూ.164 కోట్లతో ప్రణాళికను రూపొందించారు. ఈక్రమంలో మొత్తం ప్రణాళికను అమలు చేసి గ్రామాలను పట్టణాలకు తీసిపోనిరీతిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది. ఏడాది క్రితం ఒక్కొక్కటిగా పనులు చేపట్టారు. ఈక్రమంలో మండలంలోని 40 అంగన్‌వాడీ కేంద్రాలకు ఆట వస్తువులు, విద్యా సామగ్రి, వంటగ్యాస్‌ పొయ్యిలు, రంగులు వేయించడం వంటి పనులను పూర్తి చేశారు. 44 ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యాలు, శౌచాలయాలు, ప్రహరీలు, విద్యుత్తు సదుపాయాల్ని కల్పించారు. పాఠశాలల్లో 24 నాలుగు గంటలు విద్యుత్తు సరఫరా చేసే ఉద్దేశంతో తొలిసారిగా సౌర విద్యుత్తు ఫలకలను అమర్చారు. ప్రస్తుతం నిరంతరాయంగా విద్యుత్తు అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులకు బోధిస్తున్న తెర, విగణిత పాఠాలకు ఆటంకం లేకుండాచేశారు. తరగతి గదుల నిర్మాణంలో మాత్రం ఉదాసీనత వహిస్తున్నారు. 11 ప్రభుత్వ పాఠశాలల్లో రూ.1.66 కోట్లతో అదనపు తరగతి గదుల్ని నిర్మించేందుకు ఖరారు చేశారు. ఒక్కో గది నిర్మాణానికి రూ.8.3 లక్షలు కేటాయించినా ఇప్పటివరకు అంతారం, చిట్టిగణాపూర్‌తోపాటు మరో రెండుచోట్ల నిర్మాణాలు పూర్తికాలేవు. దీంతో రూ.అరకోటి దాకా నిధులు వృథాగా మారాయి. విద్యార్థులకు వరండాలో పాఠాల బోధనతో ఏకగ్రతపై ప్రభావం చూపుతోంది.

ఒక్కటీ పూర్తవని ఆరోగ్య ఉపకేంద్రాలు
తొమ్మిది గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణానికి ఖరారు చేశారు. ఒక్కో నిర్మాణానికి రూ.19 లక్షలు కేటాయించారు. ఇప్పటివరకు ఒక్క మల్కాపూర్‌లో మాత్రమే పనులు ప్రారంభించగా అవి కూడా ఆరు నెలల క్రితం నిలిచిపోయాయి. జిన్‌గుర్తి, అంతారం, అల్లాపూర్‌, ఎల్మకన్నె, బెల్కటూరు, కరణ్‌కోటలో శిలాఫలకలు ఆవిష్కరించి ఏడాది గడుస్తున్నా పునాదులు పడటం లేదు. దీంతో నిర్మాణాలకు సంబంధించి రూ.1.71 కోట్లు ఖాతాలకు పరిమితం చేశారు. గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలు లేకపోవడంతో శని, బుధవారాల్లో చిన్నారులు, గర్భిణులకు టీకాలు, వివిధ ఆరోగ్య పరీక్షలను అంగన్‌వాడీ కేంద్రాలు, డ్వాక్రా భవనాలు, ప్రభుత్వ పాఠశాల ఆవరణ, పంచాయతీ ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. దీంతో ఏఎన్‌ఎంలు, లబ్ధిదారులు అసౌకర్యానికి గురవుతున్నారు.

దస్త్రాలకే పరిమితమైన గిడ్డంగులు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా ఉల్లి పంటను తాండూరు మండలం గ్రామాల్లో పండిస్తారు. మిట్టబాస్పల్లి, గుంతబాస్పల్లి, ఐనెల్లి, సిరిగిరిపేట, రాంపూర్‌, రాంపూర్‌తండా, వీరారెడ్డిపల్లి, కోటబాస్పల్లి, మల్కాపూర్‌, సంగెంకలాన్‌, అంతారం, బెల్కటూరు, వీర్‌శెట్టిపల్లి, చంద్రవంచ, కరణ్‌కోట, అల్లాపూర్‌, కొత్లాపూర్‌లో వందల సంఖ్యలో రైతులు ఉల్లిని సాగు చేస్తున్నారు. మొత్తం 1,500 ఎకరాల్లో పండిస్తుండగా దాదాపు లక్షన్నర క్వింటాళ్ల దిగుబడులను సాధిస్తున్నారు. ఆరు నెలలపాటు శ్రమించి పండిస్తున్న పంటకు గిట్టుబాటయ్యే ధర పొందేదాకా నిల్వ చేసేందుకు శీతల గిడ్డంగులు నిర్మించాలన్న డిమాండ్‌ నెలకొంది. ఈక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిదులు రూర్బన్‌ పథకంలో ప్రతిపాదించారు. దీంతో రూ.88 లక్షలతో శీతల గిడ్డంగులు, వ్యవసాయ ఉత్పత్తుల్ని ఆరబెట్టేందుకు ఫ్లాట్‌ఫాôలను నిర్మించాలని నిర్ణయించారు. రెండు సంవత్సరాలుగా పనులు దస్త్రం దాటడం లేదు. దీంతో చమటోడ్చి పండించిన ఉల్లిని నిలువ చేసే వీల్లేక విపణిలో లభించే అరకొర ధరలకు విక్రయిస్తు పెట్టుబడులు నష్టపోవాల్సిన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. వేలాది మంది రైతుల సమస్యను పరిష్కరించే లక్ష్యంతో కేటాయించిన నిధుల్ని సద్వినియోగం చేస్తూ వెంటనే శీతల గిడ్డంగుల్ని అందుబాటులోకి తేవాలని అన్నదాతలు కోరుతున్నార

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.