close

బుధవారం, జులై 17, 2019

ప్రధానాంశాలు

అవకాశం లేకే నృత్యం నేర్చుకోలేకపోయా 

నృత్య కిన్నెర వార్షిక సాంస్కృతికోత్సవంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గండికోట శ్రీదేవి

రవీంద్రభార[తి, న్యూస్‌టుడే: తన బాల్యంలో నృత్యం నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నా.. అవకాశం లేక నేర్చుకోలేకపోయానని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గండికోట శ్రీదేవి అన్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులు తమ పిల్లలను కళారంగంలో ప్రోత్సహిస్తున్నారని, ఇది శుభపరిణామమని అభినందించారు. రెండు రోజుల పాటు జరిగే ‘నృత్య కిన్నెర’ 34వ వార్షిక సాంస్కృతికోత్సవాలు సోమవారం రాత్రి రవీంద్రభారతి ప్రధాన మందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథి జస్టిస్‌ గండికోట శ్రీదేవి మాట్లాడుతూ పిల్లలను కళల్లో ప్రోత్సహించడమే కాకుండా ప్రదర్శనావకాశాలు కల్పించడాన్ని ఆమె అభినందించారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి మాట్లాడుతూ భారతీయ సంప్రదాయ కళలు వర్థిల్లాలన్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు బాద్మి శివకుమార్‌ మాట్లాడుతూ అకుంఠిత దీక్షతో ఎంతో శ్రమిస్తే గానీ నృత్య కళాకారులు కాలేరన్నారు. సంగీత నాటక అకాడమీ ద్వారా 8, 9, 10వ తరగతి పిల్లలకు నాటక పోటీలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కిన్నెర సంస్థల అధ్యక్షులు, పూర్వ డీజీపీ డా.ఆర్‌.ప్రభాకరరావు స్వాగతం పలికారు. కార్యదర్శి మద్దాలి రఘురామ్‌ నివేదికను సమర్పించారు. నృత్యకిన్నెర నిర్వహకురాలు, ప్రముఖ నాట్యగురువు మద్దాళి ఉషాగాయత్రి వందన సమర్పణ చేశారు. 
‘ఇలవైకుంఠం’ నృత్యరూపకం.. దివి నుంచి భువికి దిగి వచ్చిన శ్రీ వేంకçనాథుడిగా తిరుమల కొండపై వెలిసి.. తన దర్శనానికి ఆర్తితో కొండపైకి చేరుకునే భక్తజన ప్రవాహానికి చుక్కానిగా నిలిచిన కలియుగ దైవం శ్రీనివాసుడి వైభవాన్ని ‘ఇలవైకుంఠం’ నృత్యరూపకం ద్వారా నాట్యగురువు మద్దాలి ఉషాగాయత్రి తన శిష్య బృందంతో కలిసి కళ్లకు కట్టారు. ఆ గోవిందుడిని దర్శించుకుందాం.. రండి అని నర్తకీమణులు ఇచ్చిన పిలుపు ప్రేక్షకులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. మంగళవారం ‘వాగ్గేయకార వైభవం’ కూచిపూడి నృత్యరూపకం ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.