close

ఆదివారం, డిసెంబర్ 15, 2019

ప్రధానాంశాలు

‘కేశోరాం’ వ్యవస్థాపకుడు ఇక లేరు 

బి.కె. బిర్లా మృతితో బసంత్‌నగర్‌లో విషాదఛాయలు

రామగుండం, న్యూస్‌టుడే: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రయివేటు రంగంలోనే పెద్ద పరిశ్రమ అయిన కేశోరాం సిమెంటు కర్మాగారం వ్యవస్థాపకుడు బసంత్‌కుమార్‌ బిర్లా బుధవారం   మృతిచెందడంతో ఈ ప్రాంతంలో విషాదం అలుముకుంది. విషయం తెలియడంతో పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌లోని సిమెంటు కర్మాగార అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, పరిసర గ్రామాల్లో ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈసాలతక్కళ్లపల్లి భూముల్లో సున్నపురాయి నిల్వలను గుర్తించిన బిర్లా 1966లో సిమెంటు కర్మాగార నిర్మాణాన్ని ప్రారంభించారు. వివిధ స్థాయిల్లో పరిశ్రమను ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ అభివృద్ధి పథంలో నడిపించిన ఆయన ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పించారు. అంతేకాకుండా ..మిగతా 2లో పరిసర గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆధ్యాత్మిక భావనతో అనేక దేవాలయాలను పునరుద్ధరించారు. బిర్లా ఆలోచనలతో వెలిసిన కేశోరాం సిమెంటు కర్మాగారం ఇక్కడి ప్రజల్లో అనేక మార్పులు తీసుకువచ్చింది. 2 దశబ్దాల కిందట అప్పటి ప్రజలు బసంత్‌కుమార్‌ బిర్లాను ఎంతో అభిమానంతో ఆదరించేవారు. పరిశ్రమ ఏర్పాటుతో ఆయన తమ జీవితాల్లో వెలుగు నింపారని నాడు కార్మికులుగా పని చేసినవారు చెబుతుంటారు. బిర్లా ఏడాదికి ఒకసారి ఇక్కడికి వస్తున్నారంటే పండుగ వాతావరణం నెలకొనేది. ఆయన ప్రత్యేక చార్టర్‌ విమానంలో వచ్చేవారు. దీనికోసం ప్రత్యేకంగా విమానాశ్రయం, అతిథిగృహం, ఉద్యానవనం ఏర్పాటు చేశారు. వీటిలోకి ఎవరికీ ప్రవేశం ఉండదు. ఆయన రాక సందర్భంగా వీటితో పాటు కర్మాగారం అంతటా ప్రత్యేకంగా రంగులు వేసి, అలంకరించేవారు. కర్మాగారాన్ని స్థాపించిన తొలినాళ్లలో పనిచేసిన కార్మికులు, ఉద్యోగులు ఆయనను తమ కుటుంబసభ్యునిగా గుర్తించి, మన బిర్లా అంటూ చెప్పుకునేవారంటే అతిశయోక్తి కాదు. అంతగా అభివృద్ధి చెందని, కనీస సౌకర్యాలు కూడా లేని ఈ ప్రాంతంలో కేశోరాం పరిశ్రమ ఏర్పాటు చేయడం ప్రజలను అబ్బురపరిచింది. అందుకే నాటి కార్మికులు కొందరు ఆయనపై పద్యాలు, పాటలు పాడేవారు. రాజకీయ మార్పులు, సిమెంటు రంగంలో ఒడుదొడుకులు, తీవ్రవాద ప్రాబల్యం ఉన్నా ఏనాడూ ఉత్పత్తికి ఆటంకం కలగలేదు. కర్మాగారం అభివృధ్ధితో పాటు స్థానికంగా మంచి పనులు చేపట్టి, ఎన్నో కుటుంబాలను ఆదుకున్న బి.కె.బిర్లా ఆకస్మిక మరణం పట్ల పాలకుర్తి మండల ప్రజలు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
మారిన గ్రామాల రూపురేఖలు 
గోదావరిఖని: బి.కె.బిర్లా సిమెంటు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడంతో సమీప గ్రామాల్లో సుమారు 10 వేల మంది వరకు ఉపాధి అవకాశాలు లభించాయి. 1921, జనవరి 12న జన్మించిన ఆయన అతి చిన్న వయస్సులోనే పారిశ్రామికవేత్తగా ఎదిగారు. కేశోరాం సిమెంటు పరిశ్రమతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక కర్మాగారాలను స్థాపించారు. ఆయన పేరుతోనే బసంత్‌నగర్‌ కాలనీ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంతో తన కుటుంబానికి అనుబంధం ఉండేలా తండ్రి పేరిట ఘన్‌శ్యామ్‌దాస్‌నగర్‌ను ఏర్పాటు చేశారు. 2013 వరకు ఆయన ఏటా తన కుటుంబంతో కేశోరాం సందర్శనకు వచ్చేవారు. ఇక్కడి కార్మిక సంఘాల నాయకులతో సమావేశమయ్యేవారు. కార్మికుల సంక్షేమం గురించి తెలుసుకునే వారు. బిర్లాకు ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమారుడు ఆదిత్య విక్రమ్‌బిర్లా విమాన ప్రమాదంలో మృతి చెందడంతో ప్రస్తుతం కేశోరాం సిమెంటు ఫ్యాక్టరీని ఆయన కూతురు మంజుశ్రీ ఖైతాన్‌కు అప్పగించారు. భార్య సరళ ఇది వరకే మృతి చెందారు. వయస్సు మీద పడటంతో 2013 నుంచి బిర్లా ఇక్కడికి రాలేదు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.