close

శుక్రవారం, జులై 19, 2019

ప్రధానాంశాలు

కసరత్తులకు డుమ్మా కొట్టొద్దు! 

వర్షాకాలంలో బద్దకించేవారే అధికం 
విస్మరిస్తే బరువు పెరిగే ప్రమాదం 
ఈనాడు, హైదరాబాద్‌

వానాకాలంలో చిత్తడి చిత్తడిగా పరిసరాలు ఉంటాయి. చల్లగానూ వాతావరణం ఉండడం వల్ల ఉదయాన్నే నిద్ర లేవాలన్నా కష్టంగా ఉంటుంది. ఈ క్రమంలో చాలామంది వ్యాయామానికి డుమ్మా కొడుతుంటారు. రోజూ వానలు పడటం వల్ల పార్కులు, వాకింగ్‌ ట్రాక్‌లు నడిచేందుకు వీలుగా ఉండవు. ఆసక్తి ఉన్నా సరే ఈ ఇబ్బంది కారణంగా నడకకు దూరమవుతుంటారు. ఆగస్టు వరకు దాదాపు ఇదే పరిస్థితి. వర్షాకాలం ముగిసిన తర్వాత చూద్దామనే ధోరణి ఎక్కువ మందిలో కన్పిస్తుంటుంది. వ్యాయామం పట్ల నిర్లక్ష్యం, బద్దకం ఆరోగ్యానికి చేటు తెస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
ఎంత వర్షమైనా సరే రోజులో కనీసం 30 నిమిషాలైనా ఏదో ఒక కసరత్తు చేయాలన్నది ఫిట్‌నెస్‌ నిపుణుల మాట. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నవారు ఒకేసారి వ్యాయామం మానేస్తే అప్పటివరకు నియంత్రణలో ఉన్న రుగ్మతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. కొన్ని రోజులుగా చిరుజల్లులు పడుతుండటంతో ఉదయం 6 గంటలకే కిటకిటలాడే కేబీఆర్‌, సంజీవయ్య, చాచా నెహ్రూపార్కు, వెంగళ్‌రావు పార్కుల వద్ద జనం తగ్గుతున్నారు. ఏ కొంచెం మబ్బు పట్టినా చాలామంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. 
అదనపు కేలరీలు చేరి 
సాధారణంగా జులై, ఆగస్టు, సెప్టెంబరులో వానలు ఎక్కువగా పలకరిస్తుంటాయి. వ్యాయామానికి దూరమవడంతోపాటు కారం కారంగా ఉండేవాటిని ఇష్టపడుతుంటారు. మసాలా పదార్థాలు, మాంసాహారం, నూనెలు అధికôగా ఉండేవి లాగిస్తుంటారు. వీటితో శరీరంలోకి అదనపు కేలరీలు వచ్చి చేరుతుంటాయి. బరువు ఒక్కసారిగా పెరుగుతుంది. వచ్చే మూడు నెలల్లో ఒకేసారి ఆరేడు కేజీలు సులువుగా బరువు పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. దీనిని తగ్గించుకోవాలంటే మరో ఆరేడు నెలలు కష్టపడాలి. 

వర్షం పడిన రోజు ఇంట్లోనే తేలికపాటి కసరత్తులు చేసేలా ప్రణాళిక ఉండాలి. యోగా, సైక్లింగ్‌ వంటివి 30-45 నిమిషాలు చేయొచ్చు. 


ఇంట్లో అటు ఇటు కొంతసేపు నడవడం, మోకాళ్లకు ఇబ్బంది లేకపోతే మెట్లు ఎక్కి దిగడం వంటివి చేస్తే కొంత శ్రమించినట్లే లెక్క. 



సమీపంలోని మున్సిపల్‌ స్టేడియం ఉంటే అక్కడకు వెళ్లి ఇండోర్‌ షటిల్‌, టేబుల్‌ టెన్నిస్‌ వంటివి ఆడొచ్చు. 


వాన వెలిసిన తర్వాత గార్డెన్‌లో మొక్కల చుట్టూ ఏర్పడిన చెత్త చెదారం, మొదళ్లలో పేరుకున్న మట్టిని తొలగించడం, కొత్త మొక్కలు నాటేందుకు గోతులు తవ్వడం వంటి చెమట పట్టే పనులు చేయాలి. 


కొందరు ఉదయం 6-7 గంటల సమయం దాటిపోతే నడక వాయిదా వేసుకుంటారు. గంట అటూ ఇటైనా వెళ్లేందుకు ప్రయత్నించాలి. కనీసం సాయంత్రమైనా వెళ్లాలి. 


ఇంటిపక్కన జిమ్‌ ఉంటే ఈ మూడు నెలల పాటు వినియోగించుకోవచ్చు. వ్యాయామం అంటే పెద్దపెద్ద బరువులు ఎత్తడం, ఆరు పలకల దేహం కాదు. స్వేదం చిందే పని ఏదైనా కావొచ్చు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.